Sivakarthikeyan to own a multiplex soon - Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: కొత్త వ్యాపారంలోకి దిగనున్న కోలీవుడ్‌ హీరో

Published Fri, Jun 16 2023 4:48 PM | Last Updated on Fri, Jun 16 2023 5:05 PM

Is Sivakarthikeyan Owns a Multiplex? - Sakshi

కోలీవుడ్‌లో తక్కువకాలంలోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శివకార్తికేయన్‌. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన డాన్‌ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే తెలుగులోనూ అభిమానులను సంపాదించుకోవాలన్న ఆశతో నటించిన ప్రిన్స్‌ చిత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన మావీరన్‌ చిత్రం జూలై 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

అశ్విన్‌ మడోనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఇదిలా ఈ మధ్య నటీనటులు, దర్శకులు ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. దర్శకుడు అమీర్‌ ఇటీవలే ఒక కాఫీ షాపును ప్రారంభించారు. నయనతార, ప్రియ భవానీ శంకర్‌ వంటి వారు కూడా ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు.

తాజాగా శివకార్తికేయన్‌ కూడా ఇతర వ్యాపారంలోకి దిగుతున్నట్టు తాజా సమాచారం. ఈయన ఒక మల్టీ ఫ్లెక్స్‌ థియేటర్‌కు భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏషియన్‌ గ్రూప్‌ సంస్థతో కలిసి చైన్నెలో ఒక మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ ప్రారంభించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఏషియన్‌ గ్రూప్‌ సంస్థ ఇప్పటికే టాలీవుడ్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ వంటి వారి భాగస్వామ్యంలో మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లు ప్రారంభించిందన్నది గమనార్హం.

చదవండి: ఆర్జీవీ ఆఫీస్‌.. బ్రూస్‌లీ నుంచి బూతు బొమ్మల దాకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement