శివకార్తికేయన్‌తో మరోసారి! | Siva Karthikeyan getting for new movie | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌తో మరోసారి!

Published Tue, Nov 1 2016 4:15 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

శివకార్తికేయన్‌తో మరోసారి!

శివకార్తికేయన్‌తో మరోసారి!

ప్రస్తుత సీనిమాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రాల కథానాయకుల్లో యువ నటుడు శివకార్తికేయన్ ఒకరు. ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే క్రేజీ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్ ఇటీవల విడుదలైన రెమో చిత్రంతో హీరోగా చాలా ఎత్తుకు ఎదిగారని చెప్పవచ్చు. అంతే కాదు ప్రముఖ కథానాయికలు శివకార్తికేయన్‌తో కలిసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారన్నది గమనార్హం. తాజాగా మోహన్‌రాజా దర్శకత్వంలో నటించడానికి సిద్ధమతున్నారు. రెమో చిత్ర నిర్మాత ఆర్‌డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన అగ్ర నటి నయనతార నటించనున్నారు. ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం ఫేమ్ పోన్‌రామ్ దర్శకత్వంలో నటించనున్నారు.

ఇందులో ఆయనతో నటి సమంత రొమాన్‌‌స చేయనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ కథానారుుకలతో నటిస్తున్న శివకార్తికేయన్ తదుపరి నటి హన్సికతో నటించడానికీ రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే శివకార్తికేయన్‌తో నటించిన తొలి క్రేజీ నాయకి హన్సికనే. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మాన్ కరాటే మంచి విజయాన్ని సాధించింది. అలాంటి హిట్ జంట మరోసారి కలిసి నటించనున్నారన్నది తాజా సమాచారం.

ఇంతకు ముందు ఇండ్రు నేట్రు నాళై వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రవికుమార్ తాజాగా శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నాయకిగా నటి హన్సికను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం 2017 చివర్లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా శివకార్తికేయన్‌కు జంటగా రెండో సారి నటిస్తున్న నాయిక హన్సికనే అవుతుంది. నటి కీర్తీసురేశ్ ఆయనతో వరసగా రజనీమురుగన్, రెమో చిత్రాల్లో నటించారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement