
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
కథనాయికలు ఎవరైనా ఇద్దరు తాము స్నేహితులమని చెబితే నమ్మకండి అంటున్నారు యువ నటుడు విశాల్. ఈయన నటుడిగా కొన్నిసార్లు తడబడ్డారేమోగానీ నిర్మాతగా అపజయాన్ని ఎదుర్కొనలేదు. చిత్ర నిర్మాణంలో ఒక సైనికుడిలా పనిచేసి వరుస విజయాలను పొందుతున్నారు. విశాల్ కెరీర్‌లో తాజా చిత్రం ఆంబళ మరో సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ..
ప్ర: ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం చిత్ర ప్రారంభం రోజునే విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ మేరకే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పుడు మీరు అదే విధానాన్ని అమలు పరుస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాల గురించి చెప్పరూ?
జ: చాలా శ్రమతో కూడుకున్న విషయం. నేను కష్టపడడమే కాకుండా సహ నటీనటులు, సాంకేతిక వర్గాన్ని శ్రమకు గురి చేస్తున్నానని చెప్పక తప్పదు. తాజా చిత్రం ఆంబళనే తీసుకుంటే గతేడాది సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించా. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు సుందర్.సితో సహా అందరం రేయింబవళ్లు శ్రమించాం. ఇలా నాలుగు నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేయాలన్న గడువుతో ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే చిత్రాల విడుదల తేదీలను ముందుగానే నిర్ణయించి పని చేయడం అనే విధానం ఇకపై కొనసాగుతుంది.
ప్ర: ఇంతకు ముందు చిత్రాలు పాండియనాడు, నాన్ సిగప్పుమనిదన్ చిత్రాల నాయికి లక్ష్మిమీనన్, ఆంబళ చిత్ర హీరోయిన్ హన్సిక మధ్య పోలిక?
జ: నిజం చెప్పాలంటే వారిద్దరిలోనూ వృత్తిపై ఆరాధన భా వం ఉంది. లక్ష్మీమీనన్ బీ, సీ అయితే హన్సిక Xఏ ’ సెంటర్స్ హీరోయిన్ అని చెప్పవచ్చు. లక్ష్మీమీనన్‌తో నన్ను కలుపుతూ చాలా వదంతుల ప్రచారం చేశారు. హన్సికతో కలుపుతూ ప్రచారం జరగలేదు. మరో విషయం ఏమిటంటే ఆంబళ చిత్రంలో నాకు జంటగా హన్సిక హీరోయిన్ అనుకున్నప్పు డు నా ఒంటి రంగు ఏమిటి? ఆమె రంగు ఏమిటి? అని ఆలోచించాను. ఇది సెట్ అవుతుందా? అన్న సందేహం కలిగింది. అయితే హన్సిక అలాంటి సందేహాన్ని పటాపంచలు చేసింది. ఆమెది సర్దుకుపోయే గుణం.
ప్ర: సరే. ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు చేయడమే కష్టమంటున్నా రు. మీరు ఆంబళ చిత్రంలో హన్సిక, రమ్యకృష్ణ, కిరణ్, ఐశ్వ ర్య, పూనం బాజ్వా, మధురిమ, మాధవీలత అంటూ ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో నటించడం గురించి ఏమంటారు?
జ: నాకు ఇంతకుముందు తీరాద విళైయాట్టు పిళ్లై చిత్రంలో ఇలాంటి అనుభవం ఉంది. ఆ చిత్రంలో నీతూచంద్ర, సారాజైన్, తనుశ్రీ దత్తా తదితరులతో నటించి ఈ టెన్షన్ చాలురా బాబు అనిపించింది. మరో విషయం ఏమిటంటే ఇద్దరు కథానాయికలు తాము మంచి స్నేహితులమంటే నమ్మకండి. ఇద్దరు కథానాయకులు స్నేహితులమంటే అందులో నిజం ఉండవచ్చు. కథానాయికలకు ఎక్కువగా వారి దుస్తుల విషయంలోనే మనస్పర్థలు తలెత్తుతాయి. ఒకరి దుస్తులతో మరొకరు పోల్చుకుంటారు. అక్కడ నుంచే రాగద్వేషాలు మొదలవుతాయి.
ప్ర: ఇద్దరు, ముగ్గురు హీరోలతో మీ సంస్థలో సులువుగా చిత్రాలు చేయగలుగుతున్నారా. ఇది ఎలా సాధ్యమవుతోంది?
జ: ఇద్దరు, ముగ్గురు హీరోలు కలిసి నటిం చడానికి మొదట అందుకు సరైన కథ అమరాలి. ఒకవేళ అలాంటి కథ లభించినా పారి తోషికాలు భరించే శక్తి నిర్మాతలకు ఉండా లి. అది అంత సాధ్యం కాదు.
ప్ర: మీ స్నేహితుడు ఆర్యను పలు కథానాయికలతో చేర్చి వదంతులు ప్రచారం అవుతున్నాయి. తను ప్రేమ వివాహం చేసుకుంటారా?
జ: ఆర్య కచ్చితం గా తన తల్లిదండ్రులు నిశ్చయించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు.
ప్ర: సుందర్.సి దర్శకత్వంలో మీరింతకు ముందు నటించిన మదగజరాజ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది?
జ: ఆ చిత్రం ఎప్పుడు మొదలైనా విజయం సాధిస్తుంది.