నేను అలా నటిస్తే తప్పేంటి? | Lakshmi Menon goes from College to Ghost Town | Sakshi
Sakshi News home page

నేను అలా నటిస్తే తప్పేంటి?

Published Wed, Jul 15 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

నేను అలా నటిస్తే తప్పేంటి?

నేను అలా నటిస్తే తప్పేంటి?

 అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అంటారే సరిగ్గా అలాంటి పరిస్థితే. నటి లక్ష్మీమీనన్‌కు ఎదురైంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌లో నెగ్గుకొచ్చిన ఈ మలయాళికుట్టికి తాజాగా గ్లామర్‌పై ఆశ పుట్టిందట. నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించిన లక్ష్మీమీనన్ ఈసారి అందాలారబోత తో కలకలం సృష్టించాలని భావించగా వేషం లభించిందట. ప్లస్-2 పాస్ అయిన కాలేజీకి వెళుతున్న ఈ కేరళకుట్టికి తాజాగా జయం రవికి జంటగా నటించే అవకాశం వచ్చింది.

భలే చాన్స్‌లే అని చంకంత కొట్టుకున్న ఈ భామ ఈ చిత్రంలో దెయ్యం పాత్ర లభించిందట. శక్తి శరణ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. కాగా మాయ చిత్రంలో నయనతార, అరణ్మణై -2లో హన్సిక లాంటి వారు దెయ్యం కథా చిత్రాలలో నటించడంతో తాను నటించడంలో తప్పేంటి? ఆ తరహా చిత్రం ఒక అనుభవమేగా అని సరిపెట్టుకొందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement