ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్ | Lakshmi Menon to pair up with Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్

Published Tue, May 27 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్

ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్

నటి లక్ష్మీమీనన్‌ను అదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మలయాళీ బ్యూటీ హీరోయిన్‌గా తన స్థాయిని పెంచుకుంటూ పోతోంది. కుంకీ ప్రారంభమైన ఈ అమ్మడి విజయ పరంపర సుందర పాండియన్, కుట్టిపులి, పాండియనాడు, నాన్ శిగప్పు మనిధన్, అంటూ కొనసాగుతూనే ఉంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ధనుష్ హీరోగా నటిస్తూ, తన ఉండరబార్ ఫిలింస్ పతాకంపై తాజాగా ఒక చిత్రం నిర్మించనున్నారు.
 
 దీనికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రానికి కాడు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం.  ఇందులో సీనియర్ నటుడు పార్తిపన్ ఒక ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే పది రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.  దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను చెన్నై ఈసీఆర్ రోడ్డులోని ఒక కళాశాలలో పది రోజులపాటు నిర్వహించినట్లు తెలిపారు. అయితే కాడు అనే టైటిల్ తాను సిద్ధం చేసుకున్న మరో చిత్రం కథ టైటిల్ అని వివరించారు. ధనుష్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement