మీ ప్రేమ వ్యవహారాల మధ్యకు నన్నెందుకు లాగుతారంటున్నారు యువ నటి నందిత. అట్టకత్తి చిత్రం హీరోయిన్‌గా తెరపైకొచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందారు. తొలి చిత్రమే నందితకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఎదిర్ నీచ్చల్ తదితర చిత్రాలతో పక్కింటి అమ్మాయి లాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అన్నీ పల్లెటూరి పడుచు పాత్రలే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన బాడీ లాంగ్వేజ్‌కు ఈ తరహా పాత్రలే నప్పుతాయంటున్నారు.
ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తున్న చిత్రం ముండాసుపట్టి. విష్ణువిశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సి.వి.కుమార్ సంస్థ తిరుకుమరన్, ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. విశాల్, లక్ష్మీ మీనన్‌ల ప్రేమ వ్యవహారంపై విష్ణు విశాల్ ఇంతకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు విశాల్ ప్రస్తావిస్తూ విశాల్ తనపై ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారు. ఎలా అన్న ప్రశ్నకు తనకూ నందితకు మధ్య ఏదో ఉన్నట్లు ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించి తాను ఆయనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. మరి మీకు నటి నందితకు మధ్య నిజంగా అలాంటిదేమయినా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం ఆమెనే అడగండన్నారు. దీంతో విశాల్‌కు లక్ష్మీమీన్‌కు మధ్య ఏముందో, వారితో తమకు ఏమిటి సంబంధమో తనకు తెలియదు మధ్యలో తననెందుకు లాగుతారు అంటూ నటి నందిత అన్నారు.
మధ్యలో నా ఊసెందుకు?
Published Wed, Apr 30 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement