
ప్రేమ వివాహమే చేసుకుంటా...
చాలామంది హీరోయిన్లు అమ్మానాన్న చూసిన వరుడినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారు. నిజంగా ప్రేమలో పడ్డా పెళ్లి జరిగే వరకు వారి నోట ఇలాం టి మాటే వస్తుంది. లక్ష్మీమీనన్ మాత్రం ధైర్యంగా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది. కుంకీ నుంచి మంజాపై వరకు వరుస విజయాలను తన ఖాతా లో వేసుకుంది ఈ కేరళ కుట్టి. పాండియనాడు, నాన్‌సిగప్పు మనిదన్ చిత్రాల్లో విశాల్‌తో జతకట్టి ఆయనతో ప్రేమ నడుపుతోందంటూ వదంతులు ఎదుర్కొంది. అలాంటిదీ మధ్య కాస్త వెనుకబడిందనే చెప్పాలి.
కారణం ప్లస్‌టూ పరీక్షలకు సిద్ధమవడమే అంటోంది. అందుకే సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్‌తో మూడవసారి కలిసి నటించే అవకాశాన్ని వదులుకుందట. ఆ అవకాశాన్నికాజల్ అగర్వాల్ అందుకుంది. ఈ మలయాళ బ్యూటీ కార్తీతో నటించిన కొంభన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. లక్ష్మీమీనన్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడు తూ తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని కుండబద్ధలు కొట్టింది.