లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్‌ | Lakshmi Menon to romance Prabhu Deva? | Sakshi
Sakshi News home page

లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్‌

Published Thu, Feb 9 2017 2:51 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్‌

లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్‌

అదృష్టం ఉండాలేగానీ ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుందన్నది నానుడి. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్‌ది ఇదే పరిస్థితి. సక్సెస్‌ఫుల్‌ నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ కేరళాకుట్టి కెరీర్‌లో విజయాలున్నా, అవకాశాలు లేవు. కారణాలేమైనా ఇటీవల రాకరాక ఒక మంచి అవకాశం వచ్చింది. ఏఎం.రత్నం అంత పెద్ద నిర్మాత చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వచ్చింది. కాస్త ఆలస్యమైనా సూపర్‌ ఆఫర్‌ వచ్చిందని లక్ష్మీమీనన్‌ తెగ సంబరపడి పోయారు. అయితే విధి వక్రించి గాయాల పాలవ్వడంతో ఆ చిత్రాన్ని వదులు కోవలసిన పరిస్థితి. ఆ చింతలో ఉన్న ఈ అమ్మడికి మరో లక్కీచాన్స్‌ వచ్చింది. అదే ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసే అవకాశం.

 దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రభుదేవా ఎంగ్‌ మంగ్‌ సుంగ్‌ అనే చిత్రంలో నటించనున్నారు. చైనీస్‌ టైటిల్‌ తరహాలో ఉన్న ఈ చిత్రంలో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎంఎస్‌.అర్జున్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నాయకిగా నటి క్యాథరిన్‌ ట్రెసా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ అవకాశం నటి లక్ష్మీమీనన్‌ను వరించింది.

 దీని గురించి దర్శకుడు అర్జున్‌ తెలుపుతూ ప్రభుదేవాకు జంటగా లక్ష్మీమీనన్‌ నటించనున్నారని తెలిపారు. ఆమె ఇందులో భరతనాట్య డాన్సర్‌గా గ్రామీణ పాత్రలో నటించనున్నారని చెప్పారు. ఇది 1970–80 ప్రాంతంలో జరిగే పిరియడ్‌ కథా చిత్రంగా ఉంటుందని అన్నారు. ప్రభుదేవాకు తండ్రిగా దర్శకుడు తంగర్‌బచ్చన్, స్నేహితుడిగా ఆర్‌జే.బాలాజీ నటించనున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ ఈ నెల చివరిలో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement