
సినిమాల్లో ఇప్పుడు హీరోలు పాడటం సర్వసాధారణం అయ్యింది. నటుడు విజయ్, ధనుష్, శింబు ఇలా చాలా మంది నటనతో పాటు పాటలను కూడా పాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటుడు విజయ్‌సేతుపతి చేరారు. ఈయన నటుడిగా తమిళం దాటి తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. పాత్రలో వైవిధ్యం ఉందనుకుంటే హీరో, విలన్ అంటూ చూడకుండా నటించేస్తున్నారు.
ఇకపోతే నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉల్ఫ్. ఇది ఈయన నటిస్తున్న 60వ చిత్రం. ఇందులో నటి అంజు కురియన్ నాయకిగా నటిస్తుండగా పుష్ప చిత్రం ఫేమ్ అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీగోపిక, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుళ్‌విన్సెంట్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైకిలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రానికి సిండ్రిల్లా చిత్రం ఫేమ్ వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం నటుడు విజయ్ సేతుపతి ఒక పాట పాడటం విశేషం. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment