వారి మాట వినను | give instructions for home but i am not listening | Sakshi
Sakshi News home page

వారి మాట వినను

Published Tue, Mar 24 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

వారి మాట వినను

వారి మాట వినను

కోలీవుడ్‌లో లక్కీ గర్ల్ అంటే ‘లక్ష్మీ మీనన్’ అంటారు ఎవరైనా. తొలి చిత్రం ‘కుంకి’ నుంచి అప్రతిహతంగా విజయాలను అందుకుంటున్న హీరోయిన్ ఈ కేర ళ కుట్టియే. పక్కింటి అమ్మాయిగా ఇమేజ్‌ను పొందిన లక్ష్మీ మీనన్ నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాలతో రొమాన్స్ చేసింది. నటిగా అనతి కాలంలోనే అనూహ్య గుర్తింపు పొందిన లక్ష్మీ మీనన్ అనూహ్యంగా తన దృష్టిని చదువుపై మళ్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నట నకు గ్యాప్ ఇచ్చి ప్లస్ టూ పరీక్షలు రాయడంపై దృష్టి సారించిన ఈ నటి ఏప్రిల్ 5న పరీక్ష లు పూర్తవుతాయంటోంది. తదుపరి ఉన్న త విద్య కోసం బెంగ ళూరులో సెటిల్ అవ్వనుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం గురించి ఆమెయ మాట్లాడుతూ, తాను బెంగళూరులో సెటిల్ అవుతానా లేదా అని చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉందని అంది. మే చివరి వారంలో రాను న్న ప్లస్ టూ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. డిగ్రీలో ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి అని అడుగుతున్నారని, తనకైతే కామర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఈ విషయమై ఇంట్లో వారు సూచనలు ఇస్తారా అన్న ప్రశ్నకు వారు జోక్యం చేసుకోరని అంది. ఒకవేళ జో క్యం చేసుకుని, ఏమైనా సూచనలు ఇచ్చినా వా రి మాటలను వినే ప్రసక్తే లేద ని లక్ష్మీ మీనన్ కరాఖండిగా చెప్పింది. ప్రస్తుతం ఈ భామ కార్తీ సరసన నటిం చిన కొంబన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్లస్ టూ లో రిజల్ట్స్ పాజిటివ్‌గా వ చ్చి చదువుపై దృష్టి సారించినా నటనను వదిలే ప్రసక్తి లేద ని లక్ష్మీ మీనన్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement