విశాల్ ఇంద్రుడు | Indrudu is Vishal's new movie title | Sakshi
Sakshi News home page

విశాల్ ఇంద్రుడు

Published Thu, Mar 6 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

విశాల్ ఇంద్రుడు

విశాల్ ఇంద్రుడు

తెలుగు, తమిళ భాషల్లో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇటీవల విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బేనర్‌ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా విశాల్ నిర్మించిన ‘పాండియనాడు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’గా విడుదలైంది. ప్రస్తుతం విశాల్ ‘ఇంద్రుడు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నారు. సిద్ధార్ధ్ రాయ్ కపూర్ ఓ నిర్మాత. విశాల్ సరసన ‘పల్నాడు’లో నటించిన లక్ష్మీమీనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. తిరు దర్శకుడు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. త్వరలో థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటలను చిత్రీకరించనున్నారు. పూర్తయినంతవరకు రషెస్ చూసిన బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఈ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాష్‌కుమార్ పాటలు స్వరపరచిన ఈ సినిమాకి రిచర్డ్ ఎన్ నాథన్ ఛాయాగ్రాహకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement