Indrudu
-
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
మహిషుని అహాన్ని అణచిన అమ్మ
పురానీతి పూర్వం మాహిష్మతి అనే గంధర్వకాంత ఇంద్రుడి శాపవశాన మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె రంభుడు అనే రాక్షసుని వివాహమాడింది. వారికి మహిషుడనే కుమారుడు పుట్టాడు. పుట్టుకతోనే వాడు అమిత బలవంతుడయ్యాడు. అనతికాలంలోనే రాక్షస లక్షణాలను అలవరచుకున్నాడు. తన బలాన్ని మరింతగా పెంచుకోవాలనుకుని, బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. బ్రహ్మ అందుకు అంగీకరించకపోవడంతో స్త్రీలంటే అతి చులకన భావం గల మహిషుడు శరీర నిర్మాణరీత్యా బలహీనంగా ఉండే స్త్రీ తనను ఏమీ చేయలేదనే ధీమాతో, స్త్రీ చేత తప్ప తాను ఎవరిచేతిలోనూ చావకుండా ఉండే వరం కోరుకున్నాడు.ఆ వరమదంతో దేవతలను, మునులను, మానవులను వాడు పెట్టే హింసకు అంతులేకుండా పోయింది. దేవతలు, మునులు కలిసి వాడి బారి నుంచి తమను రక్షించమని వైకుంఠనాథుడిని వేడుకున్నారు. అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి, పురుషులమైన మనమెవ్వరమూ వాడిని సంహరించలేము. తానూ, తన సైన్యమూ కూడా ఆడవారి చేతిలో తప్ప మరణించనటువంటి వరం పొందాడు అంటూ సాలోచనగా చూశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చూపులు కలవడంతో వారి దృక్కుల నుండి ఒక కాంతిపుంజం జనించింది. ఆ కాంతిపుంజం వైపు పార్వతి, లక్ష్మి, సరస్వతి చూశారు. వారి చూపుల నుంచి కూడా ఒక కాంతిపుంజం వెలువడింది. ఏమి జరుగుతోందా అన్న కుతూహలంతో దేవతలందరూ కలసి ఆ కాంతిపుంజాలవైపు చూడగా, వారి వారి ఆకారాలకు, తేజస్సుకు తగ్గట్టు లెక్కలేనన్ని వెలుగు కిరణాలు వెలువడి అన్నీ కలిసి ఒకటిగా మారాయి. ఆ విధంగా సకల దేవతల తేజోపుంజాలూ కలసి వాటినుంచి అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించింది. ఆమెకు దేవతలంతా కలసి సమస్త సంపదలనూ, ఆయుధాలనూ ఇచ్చారు. అమ్మ ఆ ఆయుధాలను ధరించి, సర్వశక్తులతో, తేజస్సుతో కూడి, మదగర్వితుడైన ఆ రాక్షసుని మీదికి దండయాత్రకు వెళ్ళింది. ఆమెను చూసిన మహిషుడు ‘ఓ సుందరీ, ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావు?’ అనడిగాడు. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటుంది అమ్మ. ఆమె మాటలకు వికటంగా నవ్విన మహిషుడు ‘‘ఇంత అందంగా, సుకుమారంగా ఉన్న నీతో యుద్ధం చేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. నన్ను పెళ్లి చే సుకుని నా అంతఃపుర కాంతగా ఉండు’’ అన్నాడు అహంకారంతో. అందుకు అమ్మవారు సమ్మతించకపోవడంతో ఒక అబలవైన నీతో యుద్ధం చేయడానికి నేనెందుకు, నా అనుచరుడున్నాడు చాలు’’ అంటూ భండాసురుడిని పంపాడు. అమ్మవారు తాను కూడా తొమ్మిదేళ్ల బాలికగా రూపు మార్చుకుని, శ్యామలాదేవిని సైన్యాధిపతిగా చేసుకుని భండాసురుని అవలీలగా చేధించింది. ఆ త ర్వాత చండిగా, చాముండిగా చండాసురుని, ముండాసురుని సంహరించింది. నెత్తురు చుక్క నేల రాలితే వేలాదిమంది రాక్షసులను పుట్టించే లక్షణం గల రక్తబీజుడనే రాక్షసుని కాళికగా మారి, వాడి నెత్తురు నేలరాలకుండా రుధిర పానం చేసింది. ఆ విధంగా తొమ్మిదిరోజులపాటు ఆ రాక్షసుడు పంపిన అనుచర గణాలనందరినీ దునుమాడడంతో, విధిలేక తానే వచ్చాడు మహిషుడు. అప్పుడు అమ్మ, సింహవాహనారూఢియై, వీరవిహారం చేసి దున్నపోతు రూపంలో ఉన్న ఆ రాక్షసుని నేలమీద పడవేసి, కాళ్లతో మట్టగించి చంపేసింది. ఆడది అబల, ఆమె తననేమీ చేయలేదన్న మహిషుని అహాన్ని ఆ విధంగా ఆదిపరాశక్తిగా మారి, అణ చి వేసింది అమ్మ దుర్గమ్మ. -
ప్రహ్లాదుడి సచ్ఛీలత
నరసింహావతారం దాల్చిన శ్రీహరి హిరణ్యకశిపుడిని వధించాక, ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం లభించింది. శ్రీహరికి పరమభక్తుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన ప్రహ్లాదుడి పరిపాలనలో ముల్లోకాలూ అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో తులతూగుతూ ఉండేవి. దేవ దానవ మానవులందరూ ప్రహ్లాదుడి సుగుణాలను వేనోళ్ల కీర్తించసాగారు. ప్రహ్లాదుడి ప్రాభవం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుండటంతో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన దేవేంద్రుడికి బెంగ పట్టుకుంది. ఇక తనకు ఎన్నటికీ స్వర్గాధిపత్యం తిరిగి దక్కదేమోనన్నదే అతడి బెంగ. ఇదివరకు అతడు కొన్నిసార్లు రాక్షసుల చేతిలో దెబ్బతిని, స్వర్గాధిపత్యాన్ని వదులుకోవాల్సి వచ్చినా, హరిహరులలో ఎవరో ఒకరు అతడి రక్షణకు వచ్చి, దుష్టులైన ఆ రాక్షసులను సంహరించడంతో తిరిగి స్వర్గాధిపత్యం పొందగలిగాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే అయినా, అతడు దుష్టుడు కాడు. సకల సద్గుణ సంపన్నుడు, పరమ భాగవతోత్తముడు. అతడికి అండగా సాక్షాత్తు శ్రీహరి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కేదెలా? దీనికి తరుణోపాయం చెప్పాలంటూ ఇంద్రుడు దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్లాడు. ‘ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం ఎలా లభించింది? అతడి నుంచి నాకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కుతుందా? ముల్లోకాలూ అతడినే పొగుడుతున్నాయి? కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.‘నాయనా! ఇంద్రా! ప్రహ్లాదుడు ఉత్తములలోకెల్లా ఉత్తముడు. ఉత్తమోత్తమ జ్ఞాన సంపన్నుడు. ఉత్తమోత్తమ జ్ఞానసంపద కారణంగానే అతడికి త్రిలోకాధిపత్యం లభించింది.’ అని బృహస్పతి బదులిచ్చాడు. ‘ఉత్తమోత్తమ జ్ఞానం ఏమిటి? దయచేసి నాకు బోధించండి’ అని అర్థించాడు ఇంద్రుడు. ‘మోక్ష సాధనకు పనికి వచ్చేదే ఉత్తమోత్తమ జ్ఞానం. అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లు. అతడే నీకు ఆ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని బోధించగలడు’ అని సూచించాడు బృహస్పతి.బృహస్పతి సలహాపై ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. మోక్షాన్ని పొందగల ఉత్తమోత్తమ జ్ఞానాన్ని తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. సరేనని బోధించాడు శుక్రాచార్యుడు. అప్పటికీ సంతృప్తి చెందని ఇంద్రుడు ‘ఆచార్యా! ఇంతకు మించినదేదైనా ఉందా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది?’ అని అడిగాడు. ‘ముల్లోకాలలోనూ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని మించినది కూడా ఉంది. అదే సచ్ఛీలత. సచ్ఛీలత కావాలంటే ప్రహ్లాదుడి వద్దకు వెళ్లు.’ అని సూచించాడు శుక్రాచార్యుడు.బ్రాహ్మణ వేషం ధరించి, ప్రహ్లాదుడి వద్దకు చేరుకున్నాడు ఇంద్రుడు. తనకు జ్ఞానబోధ చేయమని అర్థించాడు. ‘నిత్యం రాజ్య వ్యవహారాలతో తలమునకలై ఉంటాను. నీకు జ్ఞానబోధ ఎప్పుడు చేయగలను? ఎవరైనా మంచి ఆచార్యుడిని చూసుకో’ అని సలహా ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయినా పట్టు వీడలేదు ఇంద్రుడు. వీలున్నప్పుడే బోధించమన్నాడు. అంతవరకు శుశ్రూష చేసుకుంటూ ఉంటానన్నాడు. సరేనన్నాడు ప్రహ్లాదుడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంద్రుడికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇంద్రుడు కూడా వినయ విధేయతలతో ప్రహ్లాదుడికి శుశ్రూష చేయసాగాడు. ఇంద్రుడి శుశ్రూషకు ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ‘ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు? ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు ఇలా బదులిచ్చాడు. ‘ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నా గురువులను ఇప్పటికీ సేవించుకుంటాను. ముల్లోకాలనూ ఏలుతున్నా ఇదంతా నా ఘనత అని భావించను. నా సచ్ఛీలతే నాకు శ్రీరామరక్షగా ఉంటోంది’ అని బదులిచ్చాడు. ‘అయితే, నీ సచ్ఛీలతను నాకు దానమివ్వు’ అని కోరాడు ఇంద్రుడు. అప్పుడు గ్రహించాడు ప్రహ్లాదుడు... తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడేనని. అయినా ఏమాత్రం సంకోచించలేదు. తన సచ్ఛీలతను అతడికి దానమిచ్చేశాడు. ప్రహ్లాదుడి నుంచి ఒక తేజస్సు వెలువడింది. ‘నేను నీ సచ్ఛీలతను. నీవు నన్ను దానం ఇచ్చేశావు. అందుకే నిన్ను వీడి వెళుతున్నా’ అంటూ ఇంద్రుడిలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అష్టలక్ష్ములు కూడా... సచ్ఛీలత లేనందున ఇకపై నీతో ఉండలేమంటూ ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశించారు. సచ్ఛీలతతో పాటు తన ఐశ్వర్యం, రాజ్యసంపద సమస్తం తనను వీడిపోయినా ప్రహ్లాదుడు దిగులు చెందలేదు. ప్రశాంత చిత్తంతో నారాయణ మంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరకు శ్రీహరి అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు. ‘రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు. ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. -
ద్రోన్ల హోరు - సర్వేల జోరు
ఇటుక ముక్కకు గతి లేదు రామా హరి ఇంద్రుని రాజధాని కడతాము కాదా మరి ఈ బ్రిక్కు, ఆ బ్రిక్కు, ఏ బ్రిక్కు అయినా సరి ఆ నగర మేడలకు ఇటుకలే విటమిన్లు కృష్ణా హరి కళ్ళు మనవైనాను, ఊళ్ళు మనవైనాను రామా హరి చూసేటి అద్దాలు ఆ సింగపూరే ఇవ్వాలి సరాసరి రైతునెరగని వారు, పంట చూడని వారు సై సింగపూరు దిగుమతులే బతుకుగా రోజు గడిపే వారు సై సింగపూరు మన నేల మన నీరు, మన చెట్టు, మన గాలి అతి వింతలూర చూపుతారట త్రీ-డీ బొమ్మలుగా ఇక కరువు తీర భూమికి భూమంటూ చేసే పరిహార పథకాల అమలు వారి డ్రోన్ లెగిరితే గాని తెలియదంట మన నేల మనకు సర్వేలు, రికార్డులు, రెవెన్యూ నిపుణులున్నా సై సింగపూరు డ్రోన్ లెగురకపోతే మన నేల తీరేదో మనకే తెలియదన్నారు తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి ఆకాశాల ఎగిరింది డ్రోనూ జీను లేని గుర్రమది ఎగిరింది వివరాలకేనంట అవునూ వివరాలది ఏర్చి తీర్చాక రావయ్యా ఓ పొలమిచ్చిన రైతన్న డ్రోన్ చూపిన నేల నీకు కేటాయింపౌనూ గొప్పగా ఓరన్న హై టెక్కు పాలనలో, తైతక్క పద్ధతిలో రామా హరి ఎంత డ్రోన్‌కు అంత కూలి ఎరగాలి జనులు కృష్ణా హరి డ్రోన్ చూపితే గాని మనం మండలాలను మనమెరుగలేమా డ్రోన్ చూపితే గాని ఏ భూమి పరిహార అర్హమో తీర్పలేమా ఇది భూకంప జోన్ అన్నకృష్ణ సంఘంకన్నా తెలివైనదా డ్రోన్ జవాబు చెప్పరెవరు రాజధాని వయ్యారాల సింగపూరు సిద్ధాంతులు సరదాల దసరాల పాట -అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు పాట పాత బడ్డది రామా హరి రాజధాని కొసకు సింగపూరు అయ్యవారు ఇచ్చేటి బిల్లు కృష్ణా హరి పండుగ దండగలా దాటి పోవును పదేడు వందల కోట్ల డాలర్లు పప్పు బెల్లాలైన ప్రజలకు మిగులునో లేదో ఈ రాజధాని హోరులో. (తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మూడు మండలాలో్ల, సింగపూర్ కంపెనీ డ్రోన్లు సర్వేలు జరిపి, పంట భూములిచ్చిన రైతులకివ్వవలసిన పరిహార భూమిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్న వార్తలు చదివాక). - రామతీర్థ 98492 00385 -
అమ్మకు మాటిచ్చా.. : హీరో విశాల్
ఈ ఏడాది డెరైక్ట్ తెలుగు మూవీ చేస్తా: హీరో విశాల్ పూర్ణామార్కెట్ : ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తమిళ డబ్బింగ్ సినిమాలతో అలరించాడు.. నేరుగా తెలుగు సినిమా చేస్తానని అమ్మకు మాటిచ్చాడంట.. అందుకే ‘అమ్మ తోడు.. ఈ ఏడాది తెలుగులో అలరిస్తా’నంటున్నాడు హీరో విశాల్. ఇటీవల విడుదలైన ఇంద్రుడు చిత్రం విజయయాత్రకు ఆదివారం నగరానికి వచ్చిన హీరో విశాల్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది తెలుగు కుటుంబమే... నేను చెన్నైలో పుట్టిపెరిగినా నాకు తెలుగు బాగా వచ్చు. ఎందుకంటే మా అమ్మ రాజమండ్రి ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ కట్టు బొట్టు సంప్రదాయాలు నాకు చిన్నప్పటి నుండి పరిచయమే. మా అమ్మకు మాటిచ్చాను. అందుకే ఈ ఏడాది తెలుగులో డైరక్ట్ మూవీ చేసి తీరుతాను. ఇందుకోసం యాక్షన్ ఓరియెంటెడ్ కథ తయారు చేశాం. దీనికి శశికాంత్ దర్శకత్వం వహిస్తాడు. విజయవాడలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ‘ఇంద్రుడు’ అలరిస్తాడు.. నా తాజా చిత్రం నిజంగా కొత్తదనంతో కూడిన కథతో మీ ముందుకు వచ్చింది. హీరో నాకొలెప్సీ అనే స్లీపింగ్ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. దుఖం, సంతోషం, కోపం ఎటువంటి ఎమోషన్ వచ్చినా హీరో నిద్రలోకి వెళ్తుంటాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా.... నా టేస్ట్‌కు తగ్గట్టు చిత్రాలు తీయాలన్న ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్థాపించాను. నా బ్యానర్లో పల్నాడు తొలి చిత్రం. ఇపుడు ఇంద్రుడు రెండోది. ఇకపై మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను. నాకు మల్టీస్టారర్ చిత్రాలంటే ఇష్టం. తె లుగు తమిళంలో ఈ సినిమా చేయాలనుంది. అలాగే నా బ్యానర్లో నాతో పాటు మంచి కధలు ఉంటే ఇతర హీరోలను పెట్టి సినిమాలు తీస్తాను. దర్శకత్వం చేయాలనుంది.... దర్శకత్వం చేయాలనేది నా ఆశ. తమిళంలో విజయ్ను హీరోగా పెట్టి మంచి చిత్రం తీస్తాను. తెలుగులో ప్రభాస్ ఇష్టం. తమిళంలో విజయ్ నచ్చుతాడు. ఇక హీరోయిన్లు అయితే గత నెల ఇలియానా, ఈ నెల కాజల్ అగర్వాల్ నచ్చింది (నవ్వుతూ) అది నా అదృష్టం.... బాల దర్శకత్వంలో వాడు వీడు చిత్రం చేయడం నా అదృష్టం. అంత మంచి దర్శకుని వద్ద పనిచేస్తూ నటనలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాలో మెల్లకన్నుతో ఓ పాత్ర చేశాను. షూటింగ్ ముందు ఓ డాక్టర్‌తో చెప్తే ఎన్ని కోట్లు ఇచ్చినా మెల్లకన్ను పెట్టి నటించడం మంచిది కాదన్నారు. కాని పాత్ర మీద ఆసక్తితో నటించాను. తదుపరి చిత్రాలు.... హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. దానిపేరు తమిళంలో పూజై, తెలుగులో పూజ పేరుతో తీస్తున్నాం. శృతిహాసన్ హీరోయిన్. దీపావళికి విడుదల చేస్తాం. విశాఖ షూటింగ్‌కు అనుకూలం.... నేను చాలాసార్లు విశాఖ వచ్చాను. ముఖ్యంగా స్టార్ క్రికెట్ మ్యాచ్‌లకు ఎక్కువ వచ్చాను. చాలా ప్రశాంత నగరం. షూటింగ్‌లకు చాలా అనుకూలం. -
వైవిధ్యమైన పాత్రలో విశాల్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ఆసక్తిని కనబరిచే హీరోల్లో విశాల్ ఒకరు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఈ నెల 20న మరో వైవిధ్యమైన పాత్రతో విశాల్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. సినిమా పేరు ‘ఇంద్రుడు’. అనూహ్యమైన సంఘటన కళ్ల ముందు జరిగినా కూడా ఠక్కున నిద్రలోకి జారిపోవడం ‘నార్కొలెప్సీ’ అనే వ్యాధి లక్షణం. ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ఈ సినిమాలో విశాల్ కనిపించబోతున్నారు. తిరు దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘నాన్ సిగప్పు మనిదన్’కు ఇది అనువాద రూపం. ఈ నెల 20న ‘ఇంద్రుడు’ విడుదల కానుంది. లక్ష్మీమీనన్ కథానాయిక. నార్కొలెప్సీ వ్యాధి కారణంగా ఇందులో హీరోకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి? వాటిని తను ఎలా ఎదుర్కోగలిగాడు? అనేది ఈ సినిమాలో ఆసక్తికమైన అంశమని దర్శకుడు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్‌ల కెమిస్ట్రీ తమిళనాట సంచలనం సృష్టించిందని, అయితే కథానుగుణంగానే వారితో ఆ హాట్సీన్స్ని తెరకెక్కించాల్సి వచ్చిందనితిరు తెలిపారు. శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరినీ విశాల్ అంతం చేసే సన్నివేశాలు ఉద్రేకపూరితంగా ఉంటాయని ఆయన అన్నారు. యూ టీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఇనియా, శరణ్య ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్. -
విశాల్ 'ఇంద్రుడు' మూవీ స్టిల్స్
-
ఇంద్రుడు మూవీ ఆడియో లాంచ్
-
విశాల్ ఇంద్రుడు
తెలుగు, తమిళ భాషల్లో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇటీవల విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బేనర్‌ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా విశాల్ నిర్మించిన ‘పాండియనాడు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’గా విడుదలైంది. ప్రస్తుతం విశాల్ ‘ఇంద్రుడు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నారు. సిద్ధార్ధ్ రాయ్ కపూర్ ఓ నిర్మాత. విశాల్ సరసన ‘పల్నాడు’లో నటించిన లక్ష్మీమీనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. తిరు దర్శకుడు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. త్వరలో థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటలను చిత్రీకరించనున్నారు. పూర్తయినంతవరకు రషెస్ చూసిన బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఈ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాష్‌కుమార్ పాటలు స్వరపరచిన ఈ సినిమాకి రిచర్డ్ ఎన్ నాథన్ ఛాయాగ్రాహకుడు.