వారిద్దరి రొమాన్స్ కొత్తగా ఉంటుంది
రెక్క చిత్రంలో విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్‌ల లవ్ రొమాన్స్ కొత్తగా ఉంటుందంటున్నా రు ఆ చిత్ర దర్శకుడు రత్నశివ. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ఈయన మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం రెక్క. విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడి నుంచి తెలుసుకుందాం.
రెక్క టైటిల్ గురించి వివరించండి?
ఎవరికైనా ఒక పని చెప్పి త్వరగా వెళ్లి ర మ్మంటే నాకేమైనా రెక్కలున్నాయా ఎగిరి వెళ్లి రావడానికి అని అంటుంటారు.అయితే ఈ చి త్రంలో విజయ్‌సేతుపతి ఎలాంటి పని చెప్పి నా రెక్కలు మొలచినట్లు వేగంగా పూర్తి చేసేస్తుంటారు. అందుకే రెక్క అనే టైటిల్‌ను నిర్ణయించాం.
అసలు రెక్క చిత్ర కథేంటి?
కుంభకోణానికి చెందిన హీరోకు మదురైకి చెందిన ఒక యువతిని ఎత్తుకు రావాలనే కమిట్‌మెంట్ ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకొస్తుండగా ఆమె తన ప్రేమికురాలని తెలుస్తుంది. అప్పుడు హీరో తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేస్తాడా? తన ప్రేమికురాలి చేయందుకుంటాడా అన్నది కథ.
విజయ్‌సేతుపతి హీరో అంటేనే వైవిధ్యం ఎదురు చూస్తారు.మరి ఈ చిత్రంలో ప్రత్యేకత?
నేను చెప్పింది అవుట్ లైన్ కథే.అది సాధారణంగా ఉందనిపించినా,కథనం జెట్‌స్పీడ్‌లో సాగుతుంది. విజయ్‌సేతుపతికీ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా ఉంటుంది. ఒక కమర్శియల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ చిత్రానికి కావలసిన అన్ని అంశాలు రెక్క చిత్రంలో ఉంటాయి.
విజయ్‌సేతుపతి న్యాయవాది పాత్ర అటగా?
న్యాయవాది పట్టా పొంది ఊరిలోనే ఉండే పాత్ర. కోర్టుకు వెళ్లకుండా తను ఏం చేస్తారన్నదే చిత్ర కథ.
నటి లక్ష్మీమీనన్‌ను మదురై అమ్మాయిగా చూపిస్తున్నారట?
అవును. విజయ్‌సేతుపతి ప్రేయసీ. మంత్రి కూతురిగా చాలా మోడ్రన్ పాత్రలో లక్ష్మీమీనన్ చాలా బాగా చేస్తున్నారు. ఇతర చిత్రాల కంటే ఆమె ఈ చిత్రంలో చాలా అందంగా కనిపిస్తారు. అలా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విజయ్‌సేతుపతికి,లక్ష్మీమీనన్‌కు మధ్య లవ్ రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుంది.
చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారట?
అవును. చిత్రంలో విలన్లుగా హరీష్ ఉత్తమన్, కబీర్‌సంగ్ నటిస్తున్నారు. విజయ్‌సేతుపతి తండ్రిగా దర్శకుడు కేఎస్.రవికుమార్, హాస్య పాత్రలో సతీష్ అంటూ చాలా మంది నటిస్తున్నారు.
డి.ఇమాన్ సంగీతం గురించి?
చిత్రానికి సంగీతం పక్కా బలం. ఇమాన్ మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అలాంటి పాటలు ఉంటాయి. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది.