
స్పీడ్ పెంచిన విశాల్
చిత్రాల విషయంలో విశాల్ వేగం పెంచారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన చిత్రం పాండియనాడు. లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా శనివారం తెరపైకి వచ్చింది. అలాగే విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యూరు. రజనీకాంత్ నటించిన నాన్ శిగప్పు మనిద్ టైటిల్‌ను విశాల్ తన తాజా చిత్రానికి పెట్టారు. ఈ చిత్రాన్ని యూటీవీ సంస్థతో కలిసి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ చిత్రంలోనూ లక్ష్మీమీనన్‌నే హీరోరుున్. తిరు దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీతో చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్ ఏకధాటిగా నిర్వహించి సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. దర్శకుడు తిరు చెప్పిన కథ విశాల్‌ను బాగా ఆకట్టుకోవడంతో వెంటనే నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు యూటీవీ సంస్థ నిర్వాహకులు ధనుంజయన్ పేర్కొన్నారు. నిర్మాతగా తన రెండో చిత్రమే యూటీవీ సంస్థతో కలిసి చేయడం ఆనందంగా ఉందని విశాల్ పేర్కొన్నారు. ఇది తన కెరియర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. తమన్ సంగీతం, రిచర్డ్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు.