ఇళయదళపతితో మూడోసారి! | Nayanthara third time with Vijay | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో మూడోసారి!

Published Wed, Oct 19 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఇళయదళపతితో మూడోసారి!

ఇళయదళపతితో మూడోసారి!

సాధారణంగానే మనుషుల్లో సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఎక్కువ. చిత్ర పరిశ్రమలో అది మరికాస్త అధికం అని చెప్పకతప్పదు. యువ దర్శకుడు అట్లీ అలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇప్పటికీ చేసింది రెండు చిత్రాలే అయినా అవి దర్శకుడిగా ఆయన్ని మంచి స్థానంలో కూర్చోబెట్టాయి. ఇక తొలి చిత్రం రాజారాణిలో నాయకి నయనతార. మరో నాయకిగా నజ్రియా నటించినా చిత్ర హిట్ క్రెడిట్‌ను నయనతారనే దక్కించుకుందని చెప్పవచ్చు.
 
  తదుపరి చిత్రం తెరిలో హీరోగా విజయ్‌ను హీరోగా ఎంచుకుని హీరోయిన్లుగా సమంత, ఎమీజాక్సన్‌లను ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించినా,తన లక్కీ హీరోయిన్ నయనతారగానే భావిస్తున్నారని సమాచారం. ఎందుకంటే రాజారాణి చిత్ర షూటింగ్ తొలి సన్నివేశాన్ని నయనతారపైనే చిత్రీకరించారు. కాగా అట్లీ తన మూడో చిత్రానికి నయనతారనే ఎంచుకోవడం గమనార్హం. ఎస్ ఇళయదళపతి విజయ్ 61వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సంచలనతార నయనతార నాయకిగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున్న నిర్మించనుంది.
 
 ఇందులో తన లక్కీ హీరోయిన్ నయనతారను చాలా కొత్త యాంగిల్‌లో మరింత యవ్వనంగా చూపించనున్నారట. అందుకోసం సరికొత్త లొకేషన్స్‌ను. ఢిపరెంట్ కాస్ట్యూమ్స్‌ను రెడీ చేయిస్తున్నారట. మరో విషయం ఏమిటంటే అట్లీ చిత్రంలో వినూత్నంగా కనిపించడానికి నయన్ తను అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నాలకు రెడీ అవుతున్నారట. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్ పైకి వెళ్లనుంది.
 
  అప్పటిలోగా తన అందాలను ద్విగిణీకృతం చేసుకోవడానికి కసరత్తులు మొదలెట్టారన్న టాక్ కోలీవుడ్‌లో వినిపొస్తోంది. కాగా ఈ చిత్రంతో ఇళయదళపతితో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయడానికి నయనతార సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు విల్లు చిత్రంలో నాయకిగానూ, శివకాశి చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలోనూ విజయ్‌తో నయన్ జత కట్టారన్నది గమనార్హం.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement