న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేసింది.
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో సీఎం రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లుగా కూడా కనిపించడం కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా, మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్ కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది.
స్టింగ్ ఆపరేషన్; సీఎంకు సీబీఐ సమన్లు
Published Sun, May 22 2016 1:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM
Advertisement
Advertisement