యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు అలీ మర్చంట్. తాజాగా తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!)
వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. సినీతారల కోసం ప్రత్యేకంగా నవంబర్ 15 న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
కాగా.. అలీ మర్చంట్ ఇంతకుముందే నటి సారా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. తాజాగా మూడోసారి తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా.. అలీ 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'బాందిని', 'యే హై ఆషికి' వంటి సీరియల్స్‌లో నటించారు. అంతే కాకుండా లాక్‌అప్ -1 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆయన భార్య ఆండ్లీబ్ మోడల్‌గా రాణిస్తోంది.
(ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!)
Comments
Please login to add a commentAdd a comment