New Cabinet Ministers
-
చంద్రబాబు కేబినెట్.. వాళ్లకు మాత్రం హ్యాండ్!
అమరావతి, సాక్షి: చంద్రబాబు మరోసారి తన మార్క్ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో 24 మంత్రి స్థానాలకుగానూ.. ఏకంగా 17 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదవి ఇచ్చి మిగిలినవన్నీ తన పార్టీకే కేటాయించుకున్నారు. అయితే.. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న మాజీలకు, ఆశావహులకు చంద్రబాబు మాత్రం మొండిచేయి చూపించారు. గత అర్ధరాత్రి కేబినెట్ జాబితా వెలువడ్డాక వాళ్లు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఈ జాబితాను పరిశీలిస్తే చాలా పెద్దదిగానే ఉంది. మూడు పార్టీలకు చెందిన సీనియర్ల జాబితా పరిశీలిస్తే.. కళా వెంకట్రావ్, గంటా శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు,ధూళిపాళి నరేంద్ర, గద్దె రామ్మోహన్, చింతమనేని ప్రభాకర్లకు కేబినెట్లో చోటు దక్కలేదు. అలాగే.. కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, రఘురామ కృష్ణంరాజు, మండలి బుద్ధప్రసాద్, కూన రవికుమార్, నక్కా కోటంరెడ్డి, బోండా ఉమా, కొలికిపూడి, జీవీ, వేమిరెడ్డి, అఖిలప్రియ, మాధవిరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఈ జాబితా నుంచే స్పీకర్‌గా ఒకరికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి చేరి పోటీ చేసి నెగ్గిన ఆనం నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు మాత్రం అవకాశం ఇచ్చారు. అదే పార్టీ నుంచి వచ్చిన కోటంరెడ్డి, గుమ్మనూరు జయరాం మాత్రం ఛాన్స్ దక్కలేదు. మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న వీళ్లలో కొందరు నిరాశలో ఉన్నట్లు వాళ్ల వాళ్ల అనుచర గణాలు చెబుతున్నాయి. మరి వీళ్ల అసంతృప్తిని చంద్రబాబు ఎలా చెరిపేస్తారో చూడాలి.ఇదీ చదవండి: ఆ ఒక్క మంత్రి పదవి కూడా టీడీపీకేనా? -
Modi 3.0: మంత్రులు–శాఖలు
సీనియర్లకు మళ్లీ అవే శాఖలు... కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర -
Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే
న్యూఢిల్లీ: అనుభవానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో యువతకు సముచిత ప్రాధాన్యమిస్తూ నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కసరత్తులో ఆసాంతం మోదీ–షా ముద్రే ప్రతిఫలించింది. పదేళ్లుగా మోదీ తొలి, మలి మంత్రివర్గాల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ మంత్రులకు ఈసారీ ప్రాధాన్యం కొనసాగింది. హోం శాఖ బాధ్యతలు మరోసారి అమిత్ షానే చేపట్టగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్ విదేశాంగ శాఖల్లో కొనసాగనున్నారు. మోదీతో పాటు మొత్తం 72 మందితో ఆదివారం ఎన్డీఏ మంత్రివర్గం కొలువుదీరడం తెలిసిందే. మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి సోమవారం శాఖలు కేటాయించారు. గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ మనుగడలో ఎన్డీఏ పక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) తదితర భాగస్వాములకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమే దక్కినా కీలక శాఖలన్నింటినీ బీజేపీయే అట్టిపెట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు స్పష్టంగా కని్పంచింది. కీలక శాఖలు కావాలని జేడీ(యూ), టీడీపీ ముందుగానే కోరినా కుదరదని బీజేపీ పెద్దలు స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అత్యధిక పోర్టుఫోలియోలు బీజేపీ మంత్రులకే దక్కాయి. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణలో తనదైన మార్కు చూపిన నితిన్ గడ్కీరీకి మరోసారి రోడ్లు–హైవే శాఖ దక్కింది. మోదీకి ప్రీతిపాత్రుడైన అశ్వినీ వైష్ణవ్‌కు కీలకమైన రైల్వే, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖలను కొనసాగించడమే గాక సమాచార–ప్రసార శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టడం విశేషం. గత ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చూసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తెలిసిందే. ఆయనకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని వార్తలొస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్య, పీయూష్ గోయల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. హర్దీప్సింగ్ పురికి పెట్రోలియం శాఖను కొనసాగిస్తూ హౌజింగ్–పట్టణ వ్యవహారాలను తప్పించారు. తొలుత న్యాయ, తర్వాత అర్త్ సైన్సెస్ బాధ్యతలు చూసిన కిరెణ్ రిజిజుకు ప్రధానమైన పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు. ‘మామ’కు వ్యవసాయం రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి కొత్తగా మోదీ కేబినెట్లో చేరిన బీజేపీ దిగ్గజాలకు ప్రధాన శాఖలే కేటాయించారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఐదేళ్ల తర్వాత కేబినెట్లో అడుగు పెట్టిన బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాకు మరోసారి మోదీ తొలి మంత్రివర్గంలో నిర్వర్తించిన ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు–రసాయనాల శాఖ కూడా దక్కింది. ఇప్పటిదాకా ఆ రెండు శాఖలనూ మాండవీయ చూశారు. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విద్యుత్‌తో పాటు పట్టణ వ్యవహారాలను అప్పగించారు. న్యాయ శాఖకు అర్జున్‌రాం మేఘ్వాల్, షిప్పింగ్‌కు సర్బానంద సోనోవాల్, పర్యావరణానికి భూపేందర్ యాదవ్, సామాజిక న్యాయానికి వీరేంద్ర కుమార్ కొనసాగారు. గిరిజన శాఖ బాధ్యతలు జ్యుయల్ ఓరంకు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి... మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కడం తెలిసిందే. వారిలో కిషన్‌కు బొగ్గు, గనులు, ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్‌కు విమానయానం రూపంలో కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి. గతంలో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. తెలంగాణ నుంచి బండి సంజయ్‌కుమార్, ఏపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవులు దక్కడం తెలిసిందే. బండికి హోం శాఖ కేటాయించారు. వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల రూపంలో రెండేసి శాఖల బాధ్యతలు అప్పగించారు. భాగస్వాములకు ఇలా... ఎన్డీఏ భాగస్వాముల్లో జేడీ(యూ) నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య–పశుసంవర్ధకం–పాడి శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖపై ఆశలు పెట్టుకున్న జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. హెచ్ఏఎం(ఎస్) చీఫ్ జితన్‌రాం మాంఝీకి ఎంఎస్ఎంఈ; ఎల్జేపీ (ఆర్వీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు ఐదు కేబినెట్, రెండు స్వతంత్ర, నాలుగు సహాయ పదవులివ్వడం తెలిసిందే. ఇక స్వతంత్ర హోదా మంత్రుల్లో శివసేన నుంచి జి.పి.జాదవ్‌కు ఆయు‹Ù, ఆరెల్డీ నేత జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి శాఖలిచ్చారు. -
ప్రధానిగా మోదీ తొలి సంతకం
న్యూఢిల్లీ, సాక్షి: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక.. సోమవారం ఉదయం పార్లమెంట్ సౌత్‌బ్లాక్‌లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇక.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైల్ ఫై తొలి సంతకం చేశారు. తద్వారా.. 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 20వేల కోట్ల రూపాయల నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది’’ అన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో.. కొత్త ప్రభుత్వం-వంద రోజుల కార్యచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే.. స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిచే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్‌గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్‌జనశక్తి పారీ్ట(రామ్‌విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్‌లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్‌గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్‌కు పట్టున్న త్రిసూర్ లోక్‌సభ స్థానంలో 2019 లోక్‌సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్‌నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్‌నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్‌కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్‌సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్‌గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్‌పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్‌పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్‌పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్‌గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్‌గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్‌లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్‌నగర్ మేయర్..తాజా లోక్‌సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్‌నగర్ మేయర్‌గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్‌గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్‌తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్‌రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
మంత్రివర్గ కూర్పు- వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత, మంత్రివర్గ కూర్పుపై ఎవరి వ్యాఖ్యలు వారు చేస్తుంటారు. ప్రత్యేకించి ప్రదాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి విమర్శలు చేస్తుందా అని గమనించడం జరిగింది. కాని ఆశ్చర్యంగా ఈ విషయం వరకు టీడీపీ మౌనం దాల్చినట్లు కనిపించింది. కాకపోతే చంద్రబాబు కాని, కొందరు టీడీపీ నేతలు కాని తాము బీసీలకు ఇంకా ఎక్కువ చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నించారు తప్ప సీఎం జగన్ కేబినెట్లో ఆయా వర్గాలకు అన్యాయం జరిగిందని కామెంట్ చేయలేకపోయారు. సీఎం జగన్ తన మంత్రి వర్గ మార్పులు, చేర్పులు చేయడంలో సఫలం అయ్యారని చెప్పడానికి ఇంతకన్నా మరో ఉదాహరణ ఉండకపోవచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలలో ఉమ్మడి ఏపీ చరిత్రలో కాని, విభజిత ఏపీలో కాని ముఖ్యమంత్రులు మంత్రివర్గ మార్పులు చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేయకుండా ఉన్న ఘట్టం దాదాపు లేదని చెప్పాలి. ప్రత్యేకించి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ బలపడిన తదుపరి ఈ విమర్శలు సహజంగానే వస్తుండేవి. కాని ఈసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో వచ్చిన అసంతృప్తులకు ప్రాధాన్యం వచ్చిందే తప్ప, ప్రతిపక్షం విమర్శలు చేయలేకపోయింది. జగన్ మంత్రివర్గంలో ఎన్నడూ లేని విధంగా బలహీనవర్గాలకు అత్యధిక ప్రాదాన్యత ఇవ్వడమే కారణమని చెప్పాలి. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన పది మందికి మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీలకు అయిదు స్థానాలు, ఎస్టీ, ముస్లిం వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు వచ్చాయి. గతంలో ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా పదవులు కేటాయిస్తే, మీడియాలో వచ్చే బ్యానర్ హెడింగ్ ఏమిటంటే సామాజిక న్యాయానికి పెద్ద పీట అనో, లేక బీసీలకు అత్యదధిక మంత్రి పదవులు అనో పెట్టేవి. కాని ఈసారి మాత్రం ఆ విషయం ప్రముఖంగా కనిపించకుండా ఒక వర్గం మీడియా ప్రయత్నించింది. అదే సమయంలో భగ్గుమన్న చిచ్చు అసంతృప్తి జ్వాలలు, తుస్సు ఇలాంటి హెడింగ్‌లు వచ్చాయి. ఏ అధికార పార్టీలో అయినా మంత్రి పదవులు ఇవ్వడం అనేది కత్తిమీద సామె. అందులోను వైఎస్ జగన్ తాను రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తామని 2019లోనే చెప్పారు. తదనుగుణంగానే ఆయన ఆ కార్యక్రమం నిర్వహించడానికి చాలా కసరత్తు చేశారు. అయినా అసంతృప్తులు సహజం. వాటిని రిపోర్టు చేయడం కూడా అభ్యంతరకరం కాదు. అదే సమయంలో మంత్రివర్గంలో ఉన్న సానుకూల అంశాలను కూడా ప్రముఖంగా ఇవ్వాలి. కాని అందులో కూడా కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకే చందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇచ్చింది. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనిని ఆయన వర్గం మీడియా భుజాన వేసుకుంది. చంద్రబాబు ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేసినా మీడియా సమావేశాలు పెట్టో, జూమ్లోనో విమర్శలు కురిపిస్తుంటారు. తీవ్రమైన భాషలో విరుచుకుపడుతుంటారు. కాని ఈసారి ఎందుకో ఆయన ఈ అంశంపై మౌనం దాల్చారు. ఆయనకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని ఎక్కడైనా ట్విటర్లో ఏమైనా కామెంట్ చేశారేమో చూస్తే ఏమీ కనిపించలేదు. మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు.దీనిని బట్టి కొత్త మంత్రివర్గంపై ఏదైనా వ్యతిరేక వ్యాఖ్య చేస్తే బలహీనవర్గాలకు తెలుగుదేశం వ్యతిరేకి అన్న ముద్రపడుతుందేమోనని భయపడ్డారని అనుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కమ్మ సామాజికవర్గానికి ఏపీ చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు. దానిపై విమర్శలు చేయడానికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా కాని సాహసించలేదు. నేరుగా ఆ విషయం ప్రస్తావిస్తే తమ సామాజికవర్గానికి పదవి ఇవ్వకపోతే స్పందించారన్న విమర్శ వస్తుందని బయపడి ఉండవచ్చు. కమ్మతో పాటు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు వేరే పదవులు ఇచ్చినా మంత్రి చాన్స్ ఇవ్వలేకపోయారు. అయినా చంద్రబాబు ఎందుకు విమర్శ చేయలేకపోయారంటే తాను కూడా బ్రాహ్మణ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. పైగా గిరిజనులు, ముస్లింలకు నాలుగున్నర ఏళ్లపాటు మంత్రి పదవి ఇవ్వలేదు. అవన్ని సహజంగానే బయటకు వస్తాయి కనుక ఆయన నోరు విప్పలేదని అనుకోవాలి. కానీ వైఎస్ జగన్ కొన్ని వర్గాలకు ఎందుకు పదవులు ఇవ్వలేకపోయారంటే దానికి కారణం సామాజికవర్గాల కూర్పులో ఎదురైన చిక్కులు, మంత్రుల సంఖ్యపై రాజ్యాంగపరంగా ఉన్న ఇబ్బంది, బలహీనవర్గాలకు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనే అని చెప్పనవసరం లేదు. సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా రెడ్డి, కాపు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, బీసీలకు అత్యదిక స్థానాలు కేటాయించారు. అలాగే ఎస్సీలకు గతంలో మాదిరి ఐదు స్థానాలు ఇచ్చారు. ఏపీలో ఉన్న సామాజికవర్గాల ప్రకారం కమ్మ వర్గం లో మెజార్టీ ఎటూ వైఎస్సార్సీపీకి దూరంగానే ఉంటుంది. అందువల్ల ఆ వర్గానికి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని అనుకుని ఉండవచ్చు. మంత్రి పదవి కోల్పోయన కొడాలి నాని కూడా దానిపై పెద్దగా సీరియస్‌గా లేనని స్పష్టం చేశారు. ఆయనకు వేరే క్యాబినెట్ హోదా పదవి ఇస్తున్నారు. వైశ్య ఎమ్మెల్యే అయిన కొలగట్ల వీరభద్రస్వామికి ఉప సభాపతి పదవి ఇవ్వడం ద్వారా కొంత బాలెన్స్ చేసే యత్నం చేశారు. క్షత్రియ వర్గ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు చీప్ విప్ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు కమ్మ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన కుమారుడు లోకేష్ తో సహా ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు.వీటితో పాటు స్పీకర్ పదవి కూడా కమ్మ వర్గానికే లభించింది. కాని జగన్ అలా చేయలేదు. రెడ్డి వర్గానికి నాలుగు మంత్రి పదవులే ఇచ్చారు. శాసనసభలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 48 మంది ఉన్నారు. వీరంతా వైఎస్సార్సీపీ కావడం ఒక ప్రత్యేకత. టీడీపీ తరపున ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. దీని ప్రకారం ప్రతి పన్నెండు మందికి ఒక పదవి ఇచ్చినట్లయింది. గతంలో చంద్రబాబు తన ప్రభుత్వంలో ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత దానిని నాలుగు చేశారు. కాని అందులో ముగ్గురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కావడం ఒక ప్రత్యేకత. ఒరిజినల్ టీడీపీ రెడ్డి ఎమ్మెల్యే ఒక్కరికే మంత్రి పదవి వచ్చిందన్నమాట. కాపు వర్గం వారు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పక్షాన ఇరవై ఇద్దరు గెలుపొందారు. ఈ వర్గం వారు నలుగురు మంత్రి పదవులు పొందారు. . అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి మంత్రి పదవి వచ్చింది. బీసీల విషయం చూస్తే వైఎస్సార్సీపీ తరపున గెలుపొందినవారు 28 మంది ఉన్నారు. వీరిలో పది మంది మంత్రి పదవులు పొందారు. ఈ లెక్కన చూస్తే ప్రతి రెండున్నర మందిలో ఒకరికి పదవి వచ్చిందన్నమాట. ఇది చాలా అరుదైన విషయమే. బీసీలకు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఈ పదవులు దక్కలేదు. ఎస్సీలు వైఎస్సార్సీపీ తరపున 27 మంది గెలిచారు. వీరిలో ఐదుగురికి పదవులు దక్కాయి. ఈ లెక్కన ప్రతి ఐదుగురిలో ఒకరికి పదవి కల్పించారు. ఇలాంటి కూర్పు గతంలో ఎన్నడూ జరగలేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కాని, ఆ వర్గం మీడియా కాని ఈ కూర్పుపై విమర్శలు చేయలేపోయింది. కాని టిడిపి ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బీసీలకు పదవులు ఇచ్చినంత మాత్రాన ఏమి అవుతుందని ప్రశ్నించారు. మరి ఇదే ప్రశ్న చంద్రబాబును కూడా అడిగి ఉండాల్సింది. ఇక ఒక పత్రిక విశ్లేషణ చేస్తూ ఒక సామాజికవర్గాన్ని మార్చితే అదే సామాజిక వర్గం మరో నేతను ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. విజ్ఞత లేకుండా ఏదిపడితే అది రాయడానికి అలవాటు పడ్డ ఆ పత్రిక ఒక వేళ అదే సామాజికవర్గానికి పదవి ఇవ్వకపోతే, ఆ వర్గానికి అన్యాయం చేశారని గొంతెత్తి ప్రచారం చేసేది. వైఎస్సార్సీపీలో పదవులు రాక అసంతృప్తికి గురి అయిన నేతలను రెచ్చకొట్టడానికి వీలైనంతగా యత్నించారు. కాని వారు ఒక్కొక్కరు సర్దుకుపోతుంటే ఈ మీడియాకు చెందిన వారు ఉస్సూరు అంటూ కనిపించారట. 151 మంది ఎమ్మెల్యేలు అదికార పార్టీకి ఉంటే ఇరవై అయిదు మంత్రి పదవులే ఉన్నాయి. దానిని కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కువ హడావుడి చేస్తారని టీడీపీ మీడియా వారు ఆశించారు. కాని ఆయన వెంటనే పరిస్థితి అర్దం చేసుకుని ముఖ్యమంత్రిని కలిశారు. నిజానికి బాలినేని ఈ మాత్రం అసంతృప్తి అయినా వ్యక్తం చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే బాలినేని ముఖ్యమంత్రి జగన్‌కు బంధువు కూడా అవుతారు. మాజీ హోం మంత్రి సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కొంత అతి చేశారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఏమి చెబితే అదే ఫైనల్ అన్న ఆమె ఇప్పుడు పదవి పోతే రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవి పోతే ఇంత బాదపడతారన్నమాట. అదే సమయంలో కొడాలి నాని, పేర్ని నాని వంటివారు మాత్రం మంత్రి పదవులను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. జగన్ మంత్రులకు కేటాయించిన శాఖలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బొత్స సత్యనారాయణకు విద్యా శాఖ, ఆదిమూలం సురేష్‌కు మున్సిపల్ శాఖ ఇచ్చారు. బొత్స మాట తీరుపై ఈ సందర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కాబినెట్లో కె.ఈ ప్రభాకర్ విద్యా శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయనకు అధ్యక్షా అన్న పదం నోటీకి తిరిగేది కాదు. అద్యచ్చా అని అనేవారు. అంత మాత్రాన ఆయన పనికి రాకుండా పోలేదు కదా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖను ఇవ్వడం ద్వారా ఒక సవాలును అప్పగించారని అనుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖను ఇచ్చారు. విశేషం ఏమిటంటే గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించిన ఈలి ఆంజనేయులు, పి.మాణిక్యాలరావులు కూడా ఇదే శాఖను నిర్వహించారు. రెండుసార్లు ఎన్నికైన బూడి ముత్యాలరావుకు బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని, కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. యువకుడైన అమరనాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖలు ఇచ్చారు. గిరిజన సీనియర్ ఎమ్మెల్యే రాజన్నదొరకు ఉప ముఖ్యమంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ దక్కింది. నారాయణస్వామి, అంజాద్ భాషలు తమ ఉప ముఖ్యమంత్రి పదవులను నిలబెట్టుకున్నారు. కొత్త మంత్రి అయిన అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి ఆయనపై మంచి విశ్వాసం ఉంచారని అనుకోవచ్చు. మరో ఆసక్తికర అంశం గుర్తు చేయాలి. ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అసెంబ్లీకి రాకుండా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆమె కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నా వీరు అనుమతించలేదు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు రోజా మంత్రి అయ్యారు. కాని చంద్రబాబు శాసనసభకు రాని పరిస్థితిని సృష్టించుకున్నారు. ఏదో సాకు చూపి తనకు తాను అసెంబ్లీ నుంచి బహిష్కరించుకున్నారు. విధి విలాపం అంటే ఇదేనేమో! ఏది ఏమైనా మంత్రివర్గంలో బీసీలకు ఇన్ని ఎక్కువ పదవులు ఇచ్చినా, ఎవరూ అభ్యంతరపెట్టలేని పరిస్థితి ఏర్పడడం జగన్ సక్సెస్ అని చెప్పారు. ఆయన తీసుకు వచ్చిన సామాజిక ఫార్ములా ఇలాగే కొనసాగి, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు కాపులను కూడా కలుపుకుని వెళ్లగలిగితే జగన్‌కు తిరుగు ఉండదనే చెప్పవచ్చు. అలా అని అతి విశ్వాసం మంచిది కాదు. ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తం చేసిన అసంతృప్తి, అలాగే మరికొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు అన్నిటిని గమనంలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా సీఎం జగన్‌కు ముఖ్యమైన పాయింటే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
మారని సెంటిమెంట్: అనకాపల్లికి మహర్దశ
అనకాపల్లి: అనకాపల్లికి మహర్దశ వచ్చింది. బెల్లంపల్లిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అనకాపల్లి పట్టణం విశాఖ జిల్లాలో ఉన్నప్పుడూ ఎంతో ప్రాధాన్యం దక్కించుకునేది. ఇప్పుడు అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడడంతో అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త జిల్లా సందడితో ఉన్న అనకాపల్లి జిల్లా వాసులకు ముఖ్యమంత్రి మరో వరాన్ని ప్రకటించారు. దీంతో కొత్త జిల్లా అంతా ఖుషీ ఖుషీగా ఉంది. డిప్యూటీ మంత్రితో కూడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవితో పాటు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కూడా అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో కొత్తజిల్లాలో కొంగొత్త ఆశలు మొదలయ్యాయి. కొనసాగుతున్న అనకాపల్లి సెంటిమెంట్... అనకాపల్లి ఎమ్మెల్యే అయితే చాలు... మంత్రి పదవి వరిస్తుందనేది సెంట్మెంట్. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర కే బినెట్లో కీలకమైన శాఖలు దక్కాయి. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా అనకాపల్లి పేరుతో జిల్లా రాగా అనకాపల్లి ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడంతో అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది. రాజకీయ, వర్గాలకతీతంగా అనకాపల్లి జిల్లాకు రెండు పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పని చేసిన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావులకు మంత్రి పదవులు లభించాయి. చదవండి: (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్) తాజాగా ఎమ్మెల్యే అమర్నాథ్కు కూడా మంత్రి పదవి రావడంతో అనకాపల్లి సెంటిమెంట్ మరోసారి నిరూపితమైంది. ఇక ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి అనకాపల్లి కేంద్రం కానుంది. ఆధ్యాత్మిక, భౌగోళిక, వారసత్వ, సుదీర్ఘ తీర ప్రాంత వనరులతో పాటు భూగర్భ నిక్షేపాలకు తోడు జలాశయాలు, నదులు, సాగునీటి కాలువలతో వ్యవసాయరంగానికి కీలకమైన అనకాపల్లి జిల్లా పరిశ్రమల స్థాపనలోనూ దూసుకుపోతోంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్, పరవాడ ఫార్మా, సింహాద్రి, అన్‌రాక్, చక్కెర కర్మాగారాలు, హెట్రో, మైహోంతోపాటు మరిన్ని పరిశ్రమలు అనకాపల్లికి దక్కనున్నాయి. అనకాపల్లి జిల్లాకు ఇప్పుడంతా మంచి శకునాలేనని పలువురు విశ్లేషిస్తున్నారు. -
అపూర్వ రాజకీయ ప్రస్థానం.. 13 ఏళ్లపాటు మంత్రిగా..
సాక్షి, శ్రీకాకుళం: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. ఇప్పటికే 13 ఏళ్లపాటు ఆయన మంత్రిగా సేవలు అందించారు. జిల్లాకు సంబంధించి ఇదే రికార్డు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు దక్కడంతో ఆయన సీనియారిటీ మరింత పెరగనుంది. అంతేకాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత ధర్మానకు దక్కింది. రెవెన్యూ మంత్రిగా మూడోసారి పనిచేసిన గౌరవం కూడా ధర్మాన ప్రసాద రావుకే లభించింది. జిల్లాలో ఇలా.. ► శ్రీకాకుళం జిల్లా తరఫున 1952 నుంచి నేటి వరకు 19 మంది నేతలు మంత్రులుగా పనిచేశారు. ► కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న చోటు దక్కించుకున్నారు. ► జిల్లాలో అత్యధిక కాలం(13 ఏళ్లు) మంత్రిగా పనిచేసిన ఘనత ధర్మాన ప్రసాదరావుకు దక్కగా, అత్యల్ప కాలం(31రోజులు) మంత్రిగా పనిచేసిన ఘనత తంగి సత్యనా రాయణకు దక్కింది. నాదెండ్ల భాస్కరరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా అతి తక్కువ రోజులు పనిచేశారు. అత్యధిక రికార్డు ధర్మానదే ► నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989లో ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు తొలిసారి మంత్రిగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. ► ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్లో కూడా మంత్రి అయ్యారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ రెండోసారి ఏర్పా టు చేసిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణానంతరం ఏర్పడిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పోస్టు దక్కింది. తాజాగా వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రి పదవి పొందారు. ► అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనతే కాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం కూడా ధర్మానకే దక్కింది. నేదురుమల్లి జనార్దనరెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరకు ఆరుగురి వద్ద పనిచేసిన మంత్రిగా రికార్డుకెక్కారు. ఇక రెవెన్యూ శాఖనైతే మూడు సార్లు చేపట్టారు. ► ధర్మాన ప్రసాదరావు తర్వాత అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గౌరవం ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు, మాజీ మంత్రి ప్రతిభా భారతికి దక్కింది. ► తమ్మినేని సీతారాం పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అత్యధికంగా 18 శాఖలకు పనిచేసిన చరిత్ర సీతారాం పేరున ఉంది. ► తాజాగా చేపట్టిన స్పీకర్ పదవితో కలిపితే 13ఏళ్ల పాటు ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినట్టు అవుతుంది. ► ప్రతిభా భారతి విషయానికొస్తే మంత్రిగా దాదాపు ఎనిమిదిన్నరేళ్లు, స్పీకర్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్ పీఆర్ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. నేపథ్యం పేరు: చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నియోజకవర్గం: రామచంద్రాపురం స్వస్థలం: అడవిపాలెం తల్లిదండ్రులు: సుభద్రమ్మ, వెంకన్న (లేట్) పుట్టినతేదీ: డిసెంబర్ 23, 1962 విద్యార్హతలు: బీఏ సతీమణి: వరలక్ష్మి సంతానం: కుమారులు నరేన్, ఉమాశంకర్ జిల్లా: కోనసీమ రాజకీయ నేపథ్యం: 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2013లో వైఎస్సార్సీపీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Kakani Govardhan Reddy: అన్నదాత.. వ్యవసాయశాఖ మంత్రయ్యాడు) -
కొలువుదీరిన కొత్త కేబినెట్
-
సామాజిక విప్లవం
-
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం
సాక్షి,అమరావతి: దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సామాజిక కోణంలో ఊహకు కూడా అందని విధంగా మంత్రివర్గం ఏర్పాటు జరిగిందని బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీల శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు ఏపీలో రాజ్యాధికారం దక్కిందని చెప్పారు. అందుకే దీన్ని సామాజిక కేబినెట్ అని చెబుతున్నామన్నారు. రాజ్యాధికారం కోసం ఎందరో మాటలు చెప్పారని, దాన్ని సాకారం చేసింది మాత్రం సీఎం జగన్ అని తెలిపారు. నూతన మంత్రివర్గంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. అంటే 70 శాతం ఉన్నారని చెప్పారు. బీసీలు, మైనారిటీలు 11 మంది, ఎస్సీలు ఐదుగురు, ఒక ఎస్టీ ఉన్నారని తెలిపారు. ఇది ఒక సామాజిక విప్లవంగా చెప్పవచ్చన్నారు. అందుకే చంద్రబాబుకు, టీడీపీకి దిక్కు తోచక అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమి చేశారు, ఈ 34 నెలల పాలనలో జగన్ ఏమి చేశారో చర్చకు సిద్ధమని అన్నారు. బాబుకు, టీడీపీ వారికి ధైర్యముంటే చర్చకు రావాలన్నారు. బీసీలకు జగన్ అత్యంత ప్రాధాన్యం రాష్ట్రంలో ఉన్న దాదాపు 139 బీసీ కులాల వారిని గతంలో ఏ ప్రభుత్వమూ గుర్తించలేదని చెప్పారు. కానీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. పనికి రాని పని ముట్లు ఇచ్చారని, అవి ఉపయోగపడకపోగా వాటిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని చెప్పారు. బీసీ కార్పొరేషన్ల గురించి బాబు ఆలోచించలేదన్నారు. గతంలో బీసీలకు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసి వారు బాగా చదువుకొనేలా చూశారని తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరు గార్చారన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు. అందులో అంతులేని అవినీతి జరిగేదని చెప్పారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన ఇంటి గడప వద్దనే అందుతోందన్నారు. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో 2100 ప్రొసీజర్లు ఉంటే, వాటిని బాబు 1000కి తగ్గించారన్నారు. జగన్ సీఎం కాగానే ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2500 ప్రొసీజర్లు తెచ్చారని తెలిపారు. -
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు
సాక్షి, అమరావతి: సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ► ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా తొలిసారి మంత్రి పదవి దక్కిన పీడిక రాజన్న దొర రెండు గంటలు ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సహచర ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడంతో అధికారులు, విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ► తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంతకం చేయకుండా రావటాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ సైగ చేయడంతో సంతకం చేసి సీఎం, గవర్నర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ► బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనవద్ద ఉన్న పెన్నుతో సంతకం చేస్తుండగా ప్రొటోకాల్ అధికారులు తమ పెన్నుతో సంతకం చేయాలని కోరారు. ► మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా 9మంది మంత్రులు సీఎంకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిలో బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కె.నారాయణస్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు. ► ఆరేకే రోజా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కాళ్లకు నమస్కరించడమే కాకుండా చేతిపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ► దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజన్న దొర, రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఈలలతో హుషారెత్తించారు. ► ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో పలువురిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అభినందించారు. -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
‘సామాజిక’ సాధికారత
సాక్షి, అమరావతి: పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత గవర్నర్, కొత్త, పాత మంత్రులు, అతిథులకు సీఎం వైఎస్ జగన్ తేనీటి విందు (హైటీ) ఇచ్చారు. రాష్ట్రంలో సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరిస్తూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నలుగురిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారినే నియమించాలన్న సీఎం జగన్ సూచన మేరకు కె.నారాయణస్వామి, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎంల హోదాను గవర్నర్ కల్పించారు. గత మంత్రివర్గంలోనూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ కేటాయించడం తెలిసిందే. ఇక ఓసీ (కాపు) సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. హోంశాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించి మరోసారి ఎస్సీ వర్గానికి చెందిన మహిళనే నియమించారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించడం తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంత్రుల గ్రూప్ ఫొటో ప్రధాన శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల్లో అట్టడుగు ప్రజానీకానికి సంక్షేమాభివృద్ధి ఫలాలను చేరవేసి ప్రగతి పథంలో సాగాలన్నది సీఎం జగన్ ఆశయం. అందులో భాగంగా గత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి చోటు కల్పిస్తే తాజా మంత్రివర్గంలో అంతకు మించి 17 మందికి స్థానం కల్పించారు. అంతేకాకుండా అత్యంత ప్రధానమైన రెవెన్యూ, విద్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, పౌరసరఫరాలు, రవాణా, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర కీలక శాఖలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం గమనార్హం. ఎస్సీలకు సమున్నత స్థానం.. సామాజిక న్యాయాన్ని చేతల్లో ఆచరిస్తూ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి సీఎం వైఎస్ జగన్ చోటు కల్పించారు. శాఖల కేటాయింపులోనూ ఎస్సీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణస్వామిని మళ్లీ అదే పదవిలో నియమించి ఎక్సైజ్ శాఖ కేటాయించారు. కొత్త మంత్రివర్గంలోనూ మళ్లీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తానేటి వనితను హోంమంత్రి పదవిలో నియమించారు. అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ఆదిమూలపు సురేష్‌కు కేటాయించారు. రవాణాతోపాటు సాంఘిక సంక్షేమ శాఖలను ఎస్సీ వర్గాలకే కేటాయించి ఆయా వర్గాలను సమున్నతంగా గౌరవించారు. గిరిజనులకు గౌరవం.. మంత్రివర్గంలో గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. ఆ వర్గానికి చెందిన పీడిక రాజన్నదొరను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖను రాజన్నదొరకు కేటాయించడం ద్వారా ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేశారు. బీసీలకు పెద్దపీట.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని ఆచరణలో చూపించిన సీఎం జగన్ మైనార్టీలతో కలిపి ఆ వర్గాలకు గత మంత్రివర్గంలో ఎనిమిది మందికి చోటు కల్పిస్తే కొత్త మంత్రివర్గంలో 11 మందికి అవకాశమిచ్చారు. బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్‌బాషాను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, విద్య, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, గృహ నిర్మాణం తదితర కీలక శాఖలను బీసీ వర్గాలకే అప్పగించారు. చేతల్లో మహిళా సాధికారత.. మహిళా సాధికారతపై చిత్తశుద్ధిని సీఎం వైఎస్ జగన్ మరోసారి చాటుకున్నారు. గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పిస్తే.. కొత్త మంత్రివర్గంలో నలుగురికి చోటు కల్పించారు. మహిళా మంత్రులకు అత్యంత కీలక శాఖలు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనితను నియమిస్తే.. కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఉషా శ్రీచరణ్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖను, ఆర్కే రోజాకు పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలను శాఖను కేటాయించి మహిళా సాధికారతపై మరో అడుగు ముందుకేశారు. కార్యక్రమం సాగిందిలా.. తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 25 మందితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11.26 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక ప్రాంగణానికి చేరుకోగా ఆ వెంటనే గవర్నర్ కూడా వచ్చారు. గవర్నర్‌కు సాదరంగా స్వాగతం పలికి ప్రమాణ స్వీకార వేదికపైకి ముఖ్యమంత్రి తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. బిశ్వభూషణ్ హరిచందన్ ... అనే నేను అంటూ అచ్చ తెలుగులో గవర్నర్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. అభినందించిన గవర్నర్ అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదవగా గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12.29 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రులు గ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే తేనేటి విందుకు హాజరయ్యారు. అక్షర క్రమంలో తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా చివరిగా విడదల రజని ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆది మూలపు సురేష్, ఉష శ్రీచరణ్ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయగా మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్‌బాషా తెలుగులో అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకర్షించింది. మిగతా వారంతా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆశీస్సులు పొందారు. నూతన మంత్రులను గవర్నర్ అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి చైర్మన్ మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, పుష్ప శ్రీవాణి, శంకర నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్చార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల నుంచి హాజరైన ప్రజలు, అనుచరులు మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. అంబటి రాంబాబు (సత్తెనపల్లి), అంజద్ బాషా షేక్ బేపారి (కడప), ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), బుగ్గన రాజేంద్రనాథ్ (డోన్), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి), గుమ్మనూరి జయరామ్ (ఆలూరు), జోగి రమేష్ (పెడన), కాకాని గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యన్నారాయణ (తాడేపల్లిగూడెం), కె. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), కేవీ ఉష శ్రీచరణ్ (కళ్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపే విశ్వరూప్ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), సీదిరి అప్పలరాజు (పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట) అనే నేను.. మంత్రులుగా పేర్ల అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన అంబటి రాంబాబు, అంజాద్ బాషా షేక్ బేపారి, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరి జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కె.నారాయణస్వామి, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పీడిక రాజన్నదొర, సీదిరి అప్పలరాజు -
ఏపీ నూతన కేబినెట్: పేర్ని, కొడాలి ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వందకు వంద శాతం తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. సీఎం జగన్ ఏ పని అప్పజెప్పినా బాధ్యతగా చేస్తానని పేర్ని నాని అన్నారు. చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే.. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటానన్నారు. సీఎం జగన్ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని అన్నారు. -
కెఎస్ఆర్ లైవ్ షో 11 April 2022
-
సవాళ్లను అధిగమిస్తూ నాయకురాలిగా ఎదిగిన విడదల రజిని
-
1986లో లా డిగ్రీ పొందిన అంబటి రాంబాబు
-
సినీ రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నఆర్కే రోజా
-
AP New Cabinet: ముచ్చటగా మూడు.. చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం
రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. చదవండి: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవులతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రి వర్గంలో జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాను సైతం జిల్లాకే కట్టబెట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచి, రాయలసీమ జిల్లాల్లోనే పెద్దాయనగా పిలిచే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ కష్టకాలంలో జిల్లా అ«ధ్యక్షుడుగా అందరినీ కలుపుకుని పార్టీని నడిపించిన కళత్తూరు నారాయణస్వామికి తొలి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఏ జిల్లాకూ దక్కని అరుదైన గౌరవాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కట్టాబెట్టారు. పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం చేశారు. నారాయణస్వామి విధేయతను సుస్థిరం చేశారు. ఇద్దరినీ తిరిగి మంత్రులుగా కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జిల్లాకు బోనస్‌గా మూడో మంత్రి రూపంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. పునర్‌వ్యవస్తీకరణలోనూ మంత్రి పదవుల కేటాయింపుల్లో ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి, దళితులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, రెడ్డి సామాజికి వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులుగా బెర్త్ ఖరారు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మూడు మంత్రి పదవులతో అరుదైన గౌరవం కల్పించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబరాన్నంటిన సంబరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైఎస్ జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితోపాటు రోజా అభిమానులు, నేతలు విజయవాడకు తరలివెళ్లారు. రోజా వికాసం.. వెల్లువెత్తిన హర్షం నగరి/నిండ్ర/పుత్తూరు రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానం దక్కడంపై నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నిండ్రలో సైతం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పరస్పరం తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్పన్, నగరి కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తిరుమలరెడ్డి, పార్టీ రాష్ట్ర యవజన విభాగం ప్రదాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నిండ్ర ఎంపీపీ దీప, పార్టీ మండల కనీ్వనర్ వేణురాజు పాల్గొన్నారు. పుత్తూరులో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. అ‘ద్వితీయ కళ’త్తూరు కార్వేటినగరం/వెదురుకుప్పం/పెనుమూరు : డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, కో–ఆప్షన్ సభ్యుడు పట్నం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, నేతలు శేషాద్రి, సుమతి పాల్గొన్నారు. పెనుమూరులో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నేతలు దూది మోహన్, బండి కమలాకరరెడ్డి, కండిగ మధు, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాలినడకన కొండకు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడికి కేబినెట్లో మళ్లీ స్థానం దక్కాలని కోరుతూ కార్వేటినగరం ఎంపీపీ లతాబాలాజీ దంపతులు ఆదివారం అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఎంపీపీ లతాబాలాజీ మాట్లాడుతూ పెద్దిరెడ్డి, నారాయణస్వామికి మంత్రి పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. విధేయతకు పట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయత చూపే అతికొద్ది మంది నాయకుల్లో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఒకరు. నిజాయతీ, వైఎస్సార్ కుటుంబంపై విధేయత ఆయనకు అభరణాలు అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. అందుకే తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవికి నారాయణస్వామిని తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాను సైతం కల్పించారు ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఆయనకు రెండోసారి మంత్రి మండలిలోకి తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి రెండోసారి మంత్రిమండలిలో చోటుదక్కడంపై హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మూడేళ్ల పాటు మంత్రిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాయన ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. వైఎస్సార్ దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ప్రప్రథమ జిల్లా అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రత్యేకించి దళిత సామాజికర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మళ్లీ చోటు కల్పించారు. రెండోసారి మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సమర్థతకు గౌరవం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ చోటుదక్కింది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా అధికారంలో ఉన్న టీడీపీకి దీటుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ కుప్పం మినహా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటుదక్కించుకుని, తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత చేసుకున్నారు. సేవకు అందలం రాజకీయంగా ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెన్నుచూపని ధీరురాలుగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం ఆమె పారీ్టలో కీలకభూమిక పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన వెంట నడిచారు. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, పాలకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆసెంబ్లీలో తన వాగ్ధాటితో అధికార పక్షానికి ఆమె ముచ్చెమటలు పట్టిస్తూ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు. అసెంబ్లీలో ఉంటే కష్టమని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆమెను అక్రమంగా ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా నిషేధం విధించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆశించినా సామాజిక సమతుల్యత వల్ల చోటు దక్కలేదు. అయినా ఆమె సేవలను గుర్తించి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటకల్పించారు. తొలిసారి మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచి వ్యక్తికి అవకాశం కోవిడ్ సమయంలో ఎమ్మెల్యే ఆర్కేరోజా సేవలు ప్రత్యక్షంగా చూశా. అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందరినో ఆదుకున్నారు. పారీ్టలను పట్టించుకోకుండా సాయం అందించారు. అలాంటి మంచి వ్యక్తికి మంత్రిగా అవకాశమివ్వడం ఆహ్వానించాల్సిన అంశం. కేబినెట్ ఎంపికలో ముఖ్యమంత్రి చక్కటి కసరత్తు చేశారని అర్థమవుతోంది. – పి. బాలసుబ్రమణ్యం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుత్తూరు సమ న్యాయం చేశారు కేబినెట్ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. ప్రధానంగా 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ అభినందనీయం. కొత్త మంత్రులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నాం. – రాజరత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు ఎంపిక బాగుంది నూతన మంత్రులను పక్కాగా ఎంపిక చేశారు. సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండా అవకాశం కల్పించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కొత్తవారిని తీసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాకు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉంది. -విజయశేఖర్, చిత్తూరు సమర్థతకు పట్టం నూతన మంత్రి వర్గంలో ఎస్సీలపై ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. అనుభవజు్ఞడైన నారాయణస్వామికి మళ్లీ అవకాశం కలి్పంచి సమర్థతకు పట్టం కట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులను మరువకుండా పదవులు కట్టబెట్టారు. ఇది హర్షించదగ్గ విషయం. – వినాయకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
AP New Cabinet: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన జట్టులో మరోసారి పాతవారికే అవకాశం కల్పించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డోన్, ఆలూరు ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, గుమ్మనూరు జయరాంకు మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో డోన్, ఆలూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. బైక్ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీలోనే.. వైఎస్సార్సీపీ ఏర్పాటైన రోజు నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో డోన్ నుంచి బుగ్గన, ఆలూరు నుంచి గుమ్మనూరు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో అప్పటి టీడీపీ ప్రభుత్వ అక్రమాలు, అవకతవకల పాలన, విధానపర నిర్ణయాలపై బుగ్గన గట్టిగా తన వాణి వినిపించారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అభ్యర్థులుగా గెలుపొందారు. ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని కాదని టీడీపీలో చేరారు. రాష్ట్రంలో అత్యధికంగా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరింది అయితే కర్నూలు జిల్లా నుంచే! ఆ సందర్భంలో గుమ్మనూరు, బుగ్గన ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీలోనే కొనసాగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డికి అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయితే నాగిరెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో పీఏసీ చైర్మన్‌గా బుగ్గన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. తొలి మంత్రివర్గంలోనే చోటు గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పూర్తిగా ఒక రాజకీయ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం దక్కింది. మంచి వక్త, మృధుస్వభావి అయిన బుగ్గనతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా చరిత్రలో బోయ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటు కల్పించడం అదే తొలిసారి. జిల్లాలో బోయ వర్గానికి చెందిన రెండో ఎమ్మెల్యేగా గుమ్మనూరు గుర్తింపు పొందారు. అంతకు ముందు డోన్‌లో మేకల శేషన్న మాత్రమే బోయ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని బీసీల్లో అధికశాతం బోయ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఆ సామాజిక వర్గం వారు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో బోయ సామాజికవర్గం వైఎస్సార్సీపీ వెంట నడుస్తోంది. మలి విడతలోనూ వారికే అవకాశం 2019 జూన్ 8న మంత్రులుగా బుగ్గన, గుమ్మనూరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థికశాఖ మంత్రిగా బుగ్గన, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. 34 నెలలపాటు మంత్రులుగా కొనసాగిన ఇద్దరూ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నెల 7న వారు రాజీనామాలు చేశారు. అయితే నూతన మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వారిద్దరిపైనే నమ్మకం ఉంచారు. ఆర్థికశాఖ, అసెంబ్లీ కార్యకలపాల నిర్వహణ మంత్రిగా కొనసాగిన బుగ్గనకు కొత్త మంత్రివర్గంలో కూడా చోటు కల్పించారు. అలాగే బీసీలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో మరోసారి జయరాంకు అవకాశం కల్పించారు. మిన్నంటిన సంబరాలు బుగ్గన, గుమ్మనూరుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో డోన్, ఆలూరు నియోజకవర్గాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డోన్‌లో ఎంపీపీ రాజశేఖరరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నివాసం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి సొంత ఊరు బేతంచెర్లలో ఎంపీపీ బుగ్గన నాగభూషణ్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చలం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్యాపిలిలో పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరాములురెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలూరులో మండల కనీ్వనర్ వీరేశ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. -
AP: కొలువు తీరిన నూతన మంత్రివర్గం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. కొత్త వారు 14 మందికి స్థానం సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు.