
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపించారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వందకు వంద శాతం తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. సీఎం జగన్ ఏ పని అప్పజెప్పినా బాధ్యతగా చేస్తానని పేర్ని నాని అన్నారు.
చదవండి: ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..
సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటానన్నారు. సీఎం జగన్ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని అన్నారు.