
సాక్షి, విజయవాడ: నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 11) ఉదయం 11 గంటల 31 నిమిషాలకు వెలగపూడి సచివాలయం ఆవరణలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రి వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు.
చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)
Comments
Please login to add a commentAdd a comment