AP Cabinet 2022 Highlights: MLA Ambati Rambabu Takes Oath As Minister At First - Sakshi
Sakshi News home page

AP Cabinet 2022: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే..

Published Mon, Apr 11 2022 12:53 PM | Last Updated on Mon, Apr 11 2022 4:23 PM

AP Cabinet 2022 MLA Ambati Rambabu Takes Oath As Minister At First - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార ఘట్టంలో భాగంగా మొదట సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు అంబటి రాంబాబు ఏపీ కేబినెట్‌గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని చేత గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌లో పాత మంత్రులను 11 మందిని కొనసాగించగా.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. 

ప్రమాణస్వీకారం చేసినవారిలో మొదటి నుంచి చివరకు..
►అంబటి రాంబాబు, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్‌, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్‌, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement