
సాక్షి, తాడేపల్లి: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సామాజిక విప్లవం. ఇప్పుడు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహావిప్లవం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారు. బీసీలంటే బ్యాక్‌వార్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ మరోసారి నిరూపించాం. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం.
సీఎం జగన్ తొలి కేబినెట్‌లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చోటిచ్చారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ సారి 25 మందిలో 70 శాతం బడుగు బలహీనవర్గాలే. మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోంది. చంద్రబాబు హయాంలో 48 శాతమే బడుగు బలహీనవర్గాల వారున్నారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదు. ఇప్పటివరకు కేబినెట్‌లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదు. మన పార్టీ మొదట నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తోంది' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)