
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండున్నరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించింది. 18 మందికి కొత్తగా మంత్రిపదవులు దక్కగా, సహాయ మంత్రులుగా ఉన్న మరో ఐదుగురికి కేబినెట్ మంత్రులుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుత మంత్రివర్గంలోని ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. 18 మంది కొత్త, 5 మంది పదోన్నతి పొందిన.. మొత్తం 23 మంది మంత్రుల చేత గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ 23 మందిలో ఆరుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఆరుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, ఇంకో 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన సురేశ్ రాణా, మహేంద్ర సింగ్, భూపేంద్రసింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్‌లు గతంలో స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా ఉన్నవారే. కేబినెట్ మంత్రుల్లో కమల్ రాణి ఒక్కరే మహిళ.
Comments
Please login to add a commentAdd a comment