కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం | Andhra Pradesh Cabinet Approves EBC Nestam In Amaravati | Sakshi
Sakshi News home page

'ఈబీసీ నేస్తం' పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం

Published Tue, Feb 23 2021 1:44 PM | Last Updated on Tue, Feb 23 2021 4:05 PM

Andhra Pradesh Cabinet Approves EBC Nestam In Amaravati - Sakshi

సాక్షి, సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్‌ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది.


అదేవిధంగా 'ఈబీసీ నేస్తం' పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో జరగనున్న అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ మంత్రులకు వివరించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని జగన్‌ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

చదవండి: 
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం
‘తుప్పలు పట్టుకుపోయాడు తుప్పు నాయుడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement