
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలన్నింటి కీ న్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ దళిత, బహుజన వర్గాలకు ఈ స్థాయిలో మంత్రి పదవులు కేటాయించలేదన్నారు. ఇది నిజంగా చరిత్రాత్మక అంశమన్నారు. బీసీలకు స్పీకర్ పదవి ఇవ్వడం గొప్ప విషయమని, ఏపీ కేబినెట్‌లో బీసీలకు 7, ఎస్సీలకు 5, ఎస్టీ, మైనార్టీలకు 1, కాపులకు 4 మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు ఇవ్వడంతో వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చూసి నేర్చుకోవాలన్నారు. తెలంగాణ మంత్రిమండలిలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment