సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్‌లోనే... పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలను అమలు పరిచే దిశగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. అలాగే అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను వైఎస్ జగన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment