నమస్తే హైదరాబాద్‌ | namastey hyderabad telugu movie started | Sakshi
Sakshi News home page

నమస్తే హైదరాబాద్‌

Published Sat, Feb 24 2018 1:07 AM | Last Updated on Sat, Feb 24 2018 1:07 AM

namastey hyderabad telugu movie started - Sakshi

ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని నేపథ్యంగా తీసుకొని  పి.సి.క్రియేషన్స్‌ పతాకంపై ‘నమస్తే హైదరాబాద్‌’ అనే పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చిమ్మని మనోహర్‌ దర్శకుడు. చిత్రవిశేషాలను మనోహర్‌ తెలియజేస్తూ– ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక తెలంగాణ దర్శకుడిగా నేను రూపొందిస్తున్న పూర్తి స్థాయి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది.

సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు. చిత్రసంగీతదర్శకుడు ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ – ‘‘మంచి పాటలివ్వడానికి స్కోప్‌ ఉన్న కథ ఇది. తెలంగాణ యువతలో మంచి సంగీత జ్ఞానం ఉంది. అందుకే నూతన గాయనీ గాయకులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో పలువురు సింగర్స్‌కు ఆడిషన్స్‌ నిర్వహించాం’’ అన్నారు. నూతన నటీనటులతో రూపొందనున్న ఈ చిత్రానికి కెమెరా: వీరేంద్ర లలిత్, నిర్మాత: ప్రదీప్‌చంద్ర, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: చిమ్మని మనోహర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement