![నేడు మాజీ సీఎస్ ప్రదీప్‌చంద్రకు వీడ్కోలు](/styles/webp/s3/article_images/2017/09/5/61483479037_625x300.jpg.webp?itok=ATGAy5In)
నేడు మాజీ సీఎస్ ప్రదీప్‌చంద్రకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు సచివాలయంలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. డీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.