• ప్రదీప్‌చంద్రకు సీసీఎల్‌ఏగా అదనపు బాధ్యతలు
• రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజీ గోపాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ ప్రదీప్‌చంద్రకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎస్‌గా రాజీవ్‌శర్మ పదవీ విరమణ నేపథ్యంలో పలు శాఖల్లో మార్పుచేర్పులు తప్పనిసరయ్యారుు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఐఏఎస్‌ల బదిలీలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బుధవారం సాయంత్రం ఈ ఉత్తర్వులు వెలువడ్డారుు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజీ గోపాల్‌ను, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్‌మిశ్రాను నియమించారు.
ఎస్సీ అభివృద్ధి విభాగం కార్యదర్శిగా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలను అజయ్ మిశ్రాకు అప్పగించారు. వెరుుటింగ్‌లో ఉన్న చిత్రా రామచంద్రన్‌కు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అశోక్ కుమార్‌ను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సోమేశ్ కుమార్‌కు రెవెన్యూ (ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్) ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సునీల్‌శర్మకు రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ కార్యదర్శి (ఇన్‌స్ట్యూషనల్ ఫైనాన్‌స)గా నియమించారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న నవీన్ మిట్టల్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ విభాగపు కార్యదర్శిగా బదిలీ చేశారు.
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా, జీఏడీ(ఐఅండ్ పీఆర్) ఎక్స్ అఫిషియో సెక్రెటరీగా ఆయనకు ఉన్న అదనపు బాధ్యతలను యథాతథంగా కొనసాగించారు. వెరుుటింగ్‌లో ఉన్న బూసాని వెంకటేశ్వరరావుకు మత్స్యశాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్‌ను యువజన సర్వీసుల కార్యదర్శిగా నియమించారు. గిరిజన శాఖ కార్యదర్శిగా మహేశ్‌దత్ ఎక్కాకు పోసింగ్ ఇచ్చారు.
సాధారణ పరిపాలనా విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాకు సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శిగా పూర్తిస్థారుు అదనపు బాధ్యతలు అప్పగించారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ శ్రుతి ఓజాను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, జగిత్యాల సబ్ కలెక్టర్ కె.శశాంకను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు.
యువ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
2014 బ్యాచ్ ప్రొబెషనరీ ఐఏఎస్‌లను వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తాండూరు సబ్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా, బోధన్ సబ్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, మెట్‌పల్లి సబ్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖీ, నారాయణ్‌పేట సబ్ కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, ములుగు సబ్ కలెక్టర్‌గా వి.పి.గౌతమ్‌ను నియమించారు.