తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్రహోం శాఖలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీ వ్‌శర్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అసిస్టెంట్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్పెషల్ కమిషనర్‌గానూ రాజీవ్ శర్మ సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యారు. ఈ రాత్రి వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎస్‌గా ఆయన కొనసాగుతారు.