తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సోమవారం ఢిల్లీ వెళ్లారు. మెట్రో పనులపై ఆయన కేంద్ర ప్రతినిధులకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సోమవారం ఢిల్లీ వెళ్లారు. మెట్రో పనులపై ఆయన కేంద్ర ప్రతినిధులకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రాజీవ్ శర్మ వెంట ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా ఉన్నారు. కాగా మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతి, తాజా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిసింది. మరోవైపు మెట్రో ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రో పనులు సాఫీగా జరిగేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణ ఇతర అంశాలను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.