సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్లో తన నివాసంలో ఎన్యుమరేటర్కు వివరాలు అందచేశారు.
హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్లో తన నివాసంలో ఎన్యుమరేటర్కు వివరాలు అందచేశారు. ఈ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్యుమరేటర్కు వెళ్లి వివరాలు తీసుకున్నారు.
కాగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవటంతో ఎన్యుమరేటర్ వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుతిరిగారు. ఇక సర్వేలో భాగంగా కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్ర నగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు వెల్లడించారు.