GHMC Commissioner Somesh Kumar
-
జీహెచ్ఎంసీ న్యూస్ !
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ఫలితాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేం దుకు టీవీ చానల్‌ను వేదికగా చేసుకోవాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతి ఆదివారం రాత్రి ‘జీహెచ్ఎంసీ న్యూస్’ పేరిట ఒక బులెటిన్‌ను రన్ చేయాలని, ఇందుకు ఆయా న్యూస్ చానళ్ల నుంచి ఆర్‌ఎఫ్‌సీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో జరిగే కార్యక్రమాల సమాహారం‘రౌండప్’లా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విశ్వనగరం దిశగా హైదరాబాద్ అనే థీమ్‌తో దీని ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8 గం టల నడుమ దీనిని నిర్వహిస్తే ఎక్కువమంది వీక్షించగలరని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యక్రమాలను వివిధ న్యూస్ చానళ్లు ప్రముఖంగానే ప్రసారం చేస్తున్నప్పటికీ, తాము చెప్పదలచుకున్నది మరింత స్పష్టంగా ప్రజ లకు చేరవేసేందుకు ఈ జీహెచ్ఎంసీ న్యూస్ బులెటిన్ ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ బులెటిన్ మధ్య విరామం లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు వినియోగించరాదని భావిస్తున్నారు. వాటి బదుల పర్యావరణం, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ప్ర జలకు అవగాహన కలిగించే, పౌరస్పృహను పెంచే కార్యక్రమాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ‘జీహెచ్ఎంసీ న్యూస్’ ఆలోచన ఉన్నప్పటికీ అమలుకు ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. -
చేయాల్సిన పనులివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదిత నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలను చైనాకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలు పరిశీలించాయి. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో చైనా ప్రతినిధుల బృందం కరీంనగర్లో పర్యటించింది. జిల్లాలోని ధర్మారం మండలంలోని బసంత్‌నగర్, చొప్పదండిలోని లక్ష్మీపూర్ గ్రామాల్లో కలియతిరిగింది. ఈ సందర్భంగా వారికి గోదావరి నుంచి మిడ్‌మానేరు వరకు నీటి తరలింపు కోసం తవ్వే సొరంగ మార్గాల గురించి నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్ వివరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుని మూసీపై 42 కిలో మీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్కైవేల (ఆకాశ మార్గం) ప్రతిపాదిత స్థలాన్ని బృందం పరిశీలించింది. వంతెన నిర్మాణ ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ వివరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమైంది. మూసీపై స్కైవేలు తక్కువ కాలంలో నిర్మిచాలని సీఎం వారికి సూచించారు.ఈ పనులకు సంబంధించి నెలలోగా నివేదిక ఇస్తామని ప్రతినిధులకు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మించే ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై కూడా వారు చర్చించారు. నిర్మాణ రంగంలో వస్తున్న నూతన మార్పులు, చైనాలో అవలంబిస్తున్న పద్ధతులను ప్రతినిధులు కేసీఆర్‌కు వివరించారు. ఒక్క రోజులోనే మూడు ఫ్లోర్ల వరకు భవనాలు నిర్మించే ‘ఫ్రీ కాస్టింగ్’ విధానం గురించి వివరించారు. హైదరాబాద్‌లో అత్యంత ఎత్తై టవర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సీఎం కోరా రు. సమావేశంలో అంజు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెరైక్టర్లు యోగేష్ వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్ కుమార్, బ్రిడ్జి డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్, ప్రతినిధులు మార్క్ వ్యూ, ఝాయ్, సీఎం ముఖ్య కార్యద ర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల పేర్లు తొలగించడం లేదు
ఆధార్‌తో అనుసంధానం 44.4 శాతం పూర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టీకరణ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం గురువారం నాటికి 44.4 శాతం పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 73.51 లక్షల ఓటర్ల కుగాను ఇప్పటి వరకు 32.45 లక్షలు ఓటర్లు ఆధార్‌తో అనుసంధానమయ్యారన్నారు. అలాగే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఓటర్ల జాబితాకై ఓటర్ల గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. గురువారం జీహెచ్ఎంసీలో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పోల్చి చూస్తే హైదరాబాద్ నగరంలో ఓటర్ల గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందన్నారు. పౌరసరఫరాల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఆధార్ డేటా సేకరించి ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా ఇళ్లు మారినా.. డోర్‌లాక్ , మరణించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయపార్టీలకు అందజేస్తామన్నారు. అలాగే జాబితాను అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం, వెబ్సైట్లో పొందుపర్చడం చేస్తామన్నారు. -
పట్టణాలు అభివృద్ధి చోదకాలు
ఢిల్లీలో కొత్త పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ. స్మార్ట్ సిటీ పథకం మోడల్‌ను పరిశీలిస్తున్న మోదీ, వెంకయ్య నగరం ఎలా పెరగాలో ప్రజలే నిర్ణయించాలి: ప్రధాని * పన్ను వసూళ్లలోహైదరాబాద్‌లా ఇతర నగరాలూ చేయాలి సాక్షి, న్యూఢిల్లీ: పట్ణణీకరణను ఒక అవకాశంగా గుర్తించాలని.. పట్టణ కేంద్రాలను అభివృద్ధి చోదకాలుగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నగరం ఎలా పెరగాలనేదానిని ఆ నగర నివాసులు, నగర నాయకత్వం నిర్ణయించాలని.. ప్రయివేటు స్థిరాస్తి డెవలపర్లు కాదని వ్యాఖ్యానించారు. నగరాలను అభివృద్ధి చోదకాలుగా మలచటం లక్ష్యంగా రూపొందించిన మూడు భారీ పథకాలు.. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (అర్బన్) కార్యక్రమాలను ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ పథకాల అమలుకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, అనుమతి, అమలు తదితరాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ మార్గదర్శకాలనూ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై మూడు పథకాలూ ప్రపంచ స్థాయి పట్టణ ప్రాంతాల నిర్మాణానికి ప్రజలు కేంద్రంగా ఉండే విధానాన్ని తీసుకొస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, అమృత్ పథకం కింద ఐదేళ్లలో 500 నగరాల పునరభివృద్ధి, అందరికీ ఇల్లు పథకం కింద 2022 నాటికి రెండు కోట్ల మంది పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. బిల్డర్ల ప్రతిష్ట చెడ్డగా ఉందని.. ఇంటి కొనుగోలుదారులకు కేంద్రం రక్షణ కల్పిస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లా మీరూ చేయండి.. ‘‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను పెంచకుండానే వసూళ్లలో వృద్ధి కనబరిచారు. అలా ఇతర మునిసిపాలిటీలు ఎందుకు చేయకూడదు? ఒక్కో మునిసిపాలిటీ ఒక్కో అంశంలో ముందంజలో ఉన్నప్పుడు.. ఆయా అంశాలన్నింటీని అన్ని మునిసిపాలిటీలు అమలు చేస్తే నగరాలన్నీ అభివృద్ధి చెందుతాయి...’’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూలు వృద్ధిపై ప్రధానికి ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను రేటు పెంచలేదు. కానీ ఎక్కడెక్కడ రావడం లేదో.. అవన్నీ వచ్చేలా చూశాం. దాదాపు 270 కేసులను కోర్టు బయట పరిష్కరించాం. 2004లో ఆస్తి పన్ను మొత్తం రూ. 156 కోట్లు ఉంటే.. గత ఏడాది అది రూ. 1,125 కోట్లకు పెరిగింది’ అని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీరాలంటే ఆయా పురపాలక సంఘాలు సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మెరుగైన సేవలందిస్తే వినియోగ రుసుం చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
నాలాలు...మృత్యు ద్వారాలు
సాక్షి, సిటీబ్యూరో : ఎక్కడైనా వర్షం కురిసిందంటే భూగర్భ జలాలు పెరుగుతాయని జనం సంతోషిస్తారు. నగరంలో పరిస్థితి అందుకు భిన్నం. గట్టిగా నాలుగు చినుకులు పడితే.. ఏ నాలాలో పడి ఎవరు మృతి చెందారనే వార్త వినాల్సి వస్తుందోననే భయాందోళనలతో గడపాల్సి వస్తోంది. తాజాగా మరోసారి అదే దుస్థితి ఎదురైంది. రెండు రోజుల వర్షానికి నాలుగు ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతం. అయినా... నివారణ చర్యలు లేవు. దుర్ఘటనలు సంభవించినపుడు అధికారుల హడావుడి ప్రకటనలు తప్ప ఆ తర్వాత చర్యలు శూన్యం. దీంతో పరిస్థితి షరా మామూలే. వానొస్తే మృత్యువు వచ్చినట్టే... గత నవంబర్‌లో సత్యవేణి.. అంతకు రెండు నెలల ముందు హిమాయత్‌నగర్‌లో మరొకరు.. కొన్నేళ్ల క్రితం అంబర్‌పేటలో బ్యాంకు ఉద్యోగిని.. ఇలా నగరంలో వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. వరదొస్తే గోదారులయ్యే రాదారులు.. కనిపించని నాలాలు... మ్యాన్‌హోళ్లు. వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గం లేదు. నాలాలపైనేఅంతస్తులకు అంతస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. ప్రతిసారీ వర్షాకాలంలో కనిపించే ఈ దుర్ఘటనలు ఈసారి వేసవిలోనే చోటు చేసుకున్నాయి. వర్షాకాలం నాటికే నాలాల్లో పూడిక తీత, సాఫీగా నీటి సరఫరా వంటి పనులు చేయలేని యంత్రాంగం వేసవిలో ఎలా ఉంటుందో తెలిసిందే. అనూహ్యంగా కురిసిన వర్షానికి అమాయకులప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శాశ్వత పరిష్కారం ఎప్పుడో.. నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలు ఉన్నాయి? ఎక్కడఏ గండం పొంచి ఉంది? ఏ చెరువులు ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? ఎక్కడ ఎన్ని పైప్లైన్లు ఉన్నాయి? డ్రైనేజీ లైన్లు ఎక్కడున్నాయి? నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సివరేజి నీరు ఏ ప్రాంతాల్లో వరదనీటి కాలువల్లో కలుస్తోంది? అందుకు కారణాలేమిటి? ఈ సమాచారం జీహెచ్ఎంసీ వద్ద లేదు. గ్రేటర్లో ఏ రహదారి పరిస్థితి ఏమిటో? ఏ ఫ్లై ఓవర్‌కు పొంచి ఉన్న ప్రమాదమెంతో... ఏ శిథిల భవనం ముప్పు ఎంతో తెలుసుకొని... ప్రమాదాలు నివారించాలనే ధ్యాస లేదు. ఆస్తిపన్ను వసూళ్లు, డస్ట్బిన్ల నుంచి చెత్త తొలగింపు, అక్రమ నిర్మాణాల గుర్తింపు వంటి పనులకు ఐటీని వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న జీహెచ్ఎంసీ ఏ రోడ్డు పరిస్థితి ఏమిటో చెప్పగలిగే స్థితిలో లేదు. ఎన్ని నాలాలు అన్కవర్డ్ (రోడ్లు, బ్రిడ్జిల కింద)గా ఉన్నాయో అంచనాలు తప్ప... సరైన లెక్కల్లేవు. ఏ నాలా ఎప్పుడు నిర్మించారో...ఎప్పుడు మరమ్మతులు చేశారో తెలియదు. వాటి జీవిత కాలమెంతో తెలియదు. రహదారులు చెరువులైనప్పుడో, రోడ్లు కుంగినప్పుడో తప్ప నాలాల స్థితిగతులను కానీ, వాటి మరమ్మతుల గురించి కానీ పట్టించుకోవడం లేదు. లెక్కలన్నీ అంచనాలే... గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. వీటి వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది.. ఎప్పటికప్పుడు తనిఖీలు, అవసరమైన చర్యలు లేనందువల్లే రెండేళ్ల క్రితం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద, నెక్లెస్ రోడ్డుల్లో రహదారులు కుంగిపోయాయి. మోడల్ హౌస్ వద్ద రోడ్డు కుంగడానికి వరదనీటి కాలువలో మురుగు నీరు పొంగి ప్రవహించడమే కారణమని అప్పట్లో భావించారు. చాలినన్ని లైన్లు లేకపోవడంతో చాలా వరకు సివరేజి కూడా వరదనీటి కాలువల్లో కలుస్తోందని తెలిసినా... ఇటు జీహెచ్ఎంసీ కానీ.. అటు వాటర్‌బోర్డు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఇటీవలే వివిధ శాఖలతో సమన్వయానికి చర్యలు ప్రారంభించారు. రోడ్లదీ అదే దుస్థితి నగరంలో ఎన్ని బీటీ రోడ్లు ఉన్నాయి? ఏ రోడ్డు బలమెంత..? అంటే వెంటనే సమాధానం చెప్పగలిగే స్థితిలో జీహెచ్ఎంసీ ఇంజినీర్లు లేరు. దీన్ని నివారించేందుకు రోడ్ నెట్వర్క్ డేటాబేస్ తయారీకి సిద్ధమైనప్పటికీ ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 8వేల కి.మీ.ల మేర రోడ్లు ఉన్నట్లు చెబుతున్న అధికారులు తొలిదశలో వెయ్యి కిలోమీటర్ల మేర డేటాబేస్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. అందుకు నియమించిన ప్రైవేట్ కన్సల్టెంట్ నివేదిక ఇచ్చినప్పటికీ, తదుపరి చర్యలపై శ్రద్ధ చూపలేదు. రూ.వందల కోట్లు ఖర్చవుతున్నా... నగరంలో రోడ్లు త్వరితంగా దెబ్బ తినేందుకు ప్రధాన కారణం వర్షపు నీరు వెళ్లే మార్గాలు లేకపోవడమే. పైప్లైన్లు, కేబుల్ పనులు చేసినప్పుడు వెంటనే పూడ్చడం లేదు. రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, పాట్‌హోల్స్ మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయాలి. అదీ జరగడం లేదు. ఏటా రూ.250- రూ.300 కోట్ల వరకు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ప్రజల ఇబ్బందులు తగ్గడం లే దు. రోడ్లపై నీటి నిల్వకు కారణం వరదనీటిని తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేకపోవడమే. వీటి ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరైనా ఏడె నిమిదేళ్లుగా ముందుకు సాగడం లేదు. నాలాల విస్తరణ పూర్తి కాకుండా ఏ చర్యలు తీసుకున్నా నిష్ర్పయోజమని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సినవి 7 అడుగులకు కుంచించుకుపోయాయి. వీటి ఆధునికీకరణకు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ.266 కోట్లు మంజూరై... పథకం కాల వ్యవధి ముగిసిపోయింది. పనులు 25 శాతం కూడా జరగలేదు. కొత్త సర్కారైనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నాలాల ఆధునికీకరణకు రూ. 10వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామన్నారు. ఇంతవరకు దానికి సంబంధిం చిన కార్యాచరణ ప్రారంభం కాలేదు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు శ్రద్ధ చూపుతున్న సర్కారు నాలాలపై అంతకంటే ముందే దృష్టి పెట్టాల్సి ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అమలు ఎప్పుడో.. తొలిదశలో 350 కి.మీ.ల మేర నాలాలను అభివృద్ధి చేయాలని గత నవంబర్‌లో నిర్ణయించారు. దశల వారీగా పనులు చేయాలనుకున్నారు. ఇందుకు ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. కానీ వారెక్కడ పని చేస్తున్నారో తెలియడం లేదు. రోడ్లపై నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అంతలోనే.. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీ యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. మంగ ళవారం ఉదయం ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఆయన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. అనంతరం వాన కష్టాలతో ప్రాణాలు పోయిన ఘటనలు వెలుగుచూశాయి. -
ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్
బంజారాహిల్స్: నగరంలోనే అత్యంత రద్దీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్ చౌరస్తాను రెండేళ్లలో ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా మారుస్తామని, ఇందుకోసం డిజైన్ కూడా పూర్తయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, మెట్రో, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ అధికారుల బృందం బుధవారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఎనిమిది రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, ఇకపై తేలికగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా డిజైన్ రూపొందించామని కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగానే మెట్రో పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించామన్నారు. సమస్య పరిష్కారానికి బంజారాహిల్స్ రోడ్ నెం. 2 వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు. మెట్రో పనులకు ఆటంకం కలగకుండా ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం అనుసంధానం చేస్తామన్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం రెండు వారాల్లో టెండర్లు పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ జంక్షన్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రస్తుతం సమీక్ష జరుగుతుందన్నారు. హెచ్ఎంఆర్ ఎండి ఎన్.వీ.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మెట్రోపనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుమ్బాషా, జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
5 కేసీఆర్!
లక్ష్యం రూ.5 వేల కోట్లు అనే దాన్ని సంక్షిప్తంగా ఆంగ్లంలో TR (అంటే టార్గెట్) 5K ఇట - ప్రయారిటీ ప్రోగ్రామ్స్.. .. అంటూ పేర్కొన్నారు. దీన్ని సంక్షిప్తంగా వాడుకలో 5 కేసీఆర్‌గా వ్యవహరిస్తున్నారు. 5K Cr అంటే 5000 కోట్లు లక్ష్యమన్నమాట. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం.. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం.. ఇది ప్రభుత్వం తరచూ చెబుతున్న మాట. దాన్ని సాధించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరం. నగరానికి సంబంధించినంతవరకు జీహెచ్ఎంసీ ఆదాయమే పెద్ద దిక్కు. విశ్వనగరంలో భాగంగా అంతర్జాతీయస్థాయి రాచబాటలు.. నింగినంటే బహుళ అంతస్తుల భవనాలు.. ఆకాశమార్గాల్లో జంక్షన్లు.. తదితర సదుపాయాలు అందుబాటులోకి తేవాలంటే కోట్లాది నిధులు కుమ్మరించాలి. వీటికి నిధులిచ్చేది ప్రభుత్వమే అయినా స్థానిక సంస్థగా వీలైనన్ని నిధులు రాబట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ భావించారు. ప్రజలపై అదనపు భారం మోపకుండా.. కొత్త పన్నులేవీ విధించకుండా.. ఎక్కువ నిధులు ఎలా సాధ్యమో ఆలోచించారు. ఆయా విభాగాల వారీగా పరిశీలనలు చేసి.. ఏ విభాగం నుంచి ఎన్ని నిధులు వసూలయ్యేందుకు వీలుంటుందో పరిగణనలోకి తీసుకున్నారు.. వాటిపై కసరత్తు చేసి ఒక అంచనాకు వచ్చారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు ఆదాయమార్గాలపై శ్రద్ధ చూపితే.. కొంత ఎక్కువ కష్టపడితే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.5 వేల కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరవచ్చని అంచనా వేశారు. దాన్ని సాధించేందుకు తరచూ అధికారులు, ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలంటే ఆయా పన్నులను వసూలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా ఏయే విభాగాల ద్వారా ఎన్ని నిధులు వచ్చే అవకాశముందో సంక్షిప్తంగా వివరిస్తూ ఒక లేఖ రూపొందించారు. లక్ష్యాన్ని సాధించేందుకుగాను ఆయా విభాగాల ఉన్నతాధికారులకు, జోనల్, డిప్యూటీ కమిషనర్లకు దాన్ని పంపించారు. టార్గెట్‌ను చేరుకోవడంతోపాటు చేపట్టాల్సిన ప్రజాసదుపాయాల గురించీ సదరు లేఖలో పొందుపరిచారు. టార్గెట్‌లో భాగంగా ఆస్తిపన్నుతోపాటు ట్రేడ్ లెసైన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు, వినోదపన్ను, వృత్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ ఫీజులు, తదితరమైన వాటిని ప్రస్తావించారు. చేయాల్సిన పనుల్లో స్లమ్ ఫ్రీసిటీ, గ్రీన్ హైదరాబాద్, లేక్ ప్రొటెక్షన్ తదితర కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఇదండీ 5 కేసీఆర్ కథాకమామిషు ఆదాయం పెంచుకునేందుకు చేసిన సూచనల్లో కొన్ని.. * జీహెచ్ఎంసీ డేటాబేస్ మేరకు ఆస్తిపన్ను జాబితాలో 1.50 లక్షల నివాసేతర(వాణిజ్య) భవనాలున్నాయి. వీటన్నింటికీ ట్రేడ్ లెసైన్సులివ్వడం ద్వారా ఫీజులు వసూలు చేయాలనేది లక్ష్యం. ఇలాంటి భవనాల వారందరికీ నోటీసులిచ్చి ఈనెలాఖరులోగా ట్రేడ్ లెసైన్సులు జారీ చేసి, డిసెంబర్ నెలాఖరులోగా ఫీజులు వసూలు చేయాలనేది యోచన. * టీఎస్ఎస్పీడీసీఎల్ గణాంకాల మేరకు గ్రేటర్లో 4.50 లక్షల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లున్నాయి. అంటే ఇవన్నీ వ్యాపార సంస్థలే. ఇవన్నీ ట్రేడ్ లెసైన్సులు పొందాల్సి ఉందని కమిషనర్ గుర్తించారు. సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులకు ఈ వివరాలందజేయాలని నిర్ణయించారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇలాంటి వాటన్నింటినుంచి ట్రేడ్‌లెసైన్సు ఫీజు వసూలు చేయాలనేది లక్ష్యం. తద్వారా జీహెచ్ఎంసీకి ట్రేడ్ * ప్రకటనల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.25 కోట్లుండగా, ఇది రూ.100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. * ప్రధాన రహదారుల వెంబడి ఉన్న భవనాలను మరోమారు తనిఖీలు చేసి.. వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, నివాస భవనాల జాబితాలోనే ఉన్నవాటిని గుర్తించి వాటికి వాణిజ్య భవనాల కనుగుణంగా ఆస్తిపన్ను విధించాలని భావించారు. * జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 160 సినిమాహాళ్లున్నాయి. వీటన్నింటి నుంచి 20 శాతం వినోదపన్నుగా జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. కానీ.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువ చూపుతూ.. టిక్కెట్ల ధరలను తగ్గించి చూపుతూ వీలైనంత వరకు జీహెచ్ఎంసీకి చెల్లించే వాటాలో కోత విధిస్తున్నాయి. వీటిని గాడిలో పెడితే కోట్ల రూపాయల ఆదాయం రాగలదని అంచనా. అలాగే ఇతరత్రా వినోద కేంద్రాలు సైతం లక్షలాదిరూపాయలు ఆర్జిస్తున్నా, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన వినోదపన్నును చెల్లించడం లేదు. అలాంటి వాటన్నింటినీ గుర్తించి, రావాల్సిన పన్నును వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. * ఇలా వివిధ మార్గాల ద్వారా రూ.5 వేల కోట్లు (అంటే 5ఓ ఇట ) లక్ష్యంగా నిర్దేశించడంతోపాటు ఎక్కువ పన్నులు వసూలు చేసే సిబ్బందికి రెట్టింపు ప్రోత్సాహకాలనూ ప్రకటించారు. -
'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 53 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తయిందని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21 లక్షల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించామని, దానికి సరిపడా సర్వే స్టేషనరీ ముద్రించామని చెప్పారు. మిగిలిన ఇళ్లను సర్వ చేస్తామని అన్నారు. 100 శాతం సర్వే కోసం వారం రోజుల గడువు కోరుతామని వెల్లడించారు. ఈ ఉదయం వరకు సర్వే కొనసాగిందని తెలిపారు. జీహెచ్ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ఆయన తెలిపారు. -
ప్రజల నుంచి అద్భుతమైన స్పందన
హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 30 శాతం సర్వే పూర్తయిందని, ఇవాళే సర్వే పూర్తి చేస్తామని ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్ నరసింహన్‌కు అందచేశామని సోమేష్ కుమార్ తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను మళ్లీ నిర్వహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే వివరాలను అప్డేట్ చేస్తామని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రజలుత తమ వివరాలన్ని సమగ్రంగా ఇస్తే వారికే మంచిదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరవేసేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇస్తే మంచిదని, వారి అకౌంట్ల్లోనే నగదు వేసేందుకు వీలు అవుతుందన్నారు. అయితే ఈ వివరాల కోసం ఎన్యుమరేటర్లు పట్టుపట్టవద్దని, ప్రజలు తమ ఇష్టప్రకారమే వివరాలు ఇవ్వవచ్చిన సోమేష్ కుమార్ తెలిపారు. -
సర్వే పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో ఎన్యుమరేటర్‌కు వివరాలు అందచేశారు. ఈ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్యుమరేటర్‌కు వెళ్లి వివరాలు తీసుకున్నారు. కాగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవటంతో ఎన్యుమరేటర్ వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుతిరిగారు. ఇక సర్వేలో భాగంగా కుందన్‌బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్ర నగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు వెల్లడించారు. -
ఎన్యుమరేటర్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఎన్యుమరేటర్ అవతారం ఎత్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్‌కు కేసీఆర్ వివరాలు అందించనున్నారు. మరోవైపు సమగ్ర సర్వేతో హైదరాబాద్ బోసిపోయింది. హోటళ్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సమగ్ర సర్వే కోసం నగరంలో నివసించేవారు తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్లటంతో పాటు, మిగతావారు సర్వే కోసంగా ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు కిటకిటలాడే నగరమంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. -
'సమగ్ర సర్వేకు 2,332 మంది నిరాకరణ'
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ప్రీ విజిట్‌లో 13.40 లక్షల కుటుంబాలను పరిశీలించారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21,636 గృహాలు తాళాలు వేసున్నాయని చెప్పారు. 2,332 మంది సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారని వెల్లడించారు. ఇప్పటికే ఇంటింటికీ చెక్ లిస్ట్ లు పంపిణీ చేశామని చెప్పారు. ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయో చెక్ లిస్టు ద్వారా తెలుస్తుందన్నారు. ఇందులో ఉన్నవన్ని దగ్గర పెట్టుకుంటే సర్వే తొందరగా పూర్తవుతుందన్నారు. సర్వేలో పూర్తి, పక్కా సమాచారం ఇస్తే మేలని సోమేష్‌కుమార్ అన్నారు. సర్వేకు సహరించాలని ప్రజలను కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని స్పష్టం చేశారు.