'సమగ్ర సర్వేకు 2,332 మంది నిరాకరణ'
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ప్రీ విజిట్‌లో 13.40 లక్షల కుటుంబాలను పరిశీలించారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21,636 గృహాలు తాళాలు వేసున్నాయని చెప్పారు. 2,332 మంది సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారని వెల్లడించారు.
ఇప్పటికే ఇంటింటికీ చెక్ లిస్ట్ లు పంపిణీ చేశామని చెప్పారు. ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయో చెక్ లిస్టు ద్వారా తెలుస్తుందన్నారు. ఇందులో ఉన్నవన్ని దగ్గర పెట్టుకుంటే సర్వే తొందరగా పూర్తవుతుందన్నారు. సర్వేలో పూర్తి, పక్కా సమాచారం ఇస్తే మేలని సోమేష్‌కుమార్ అన్నారు. సర్వేకు సహరించాలని ప్రజలను కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని స్పష్టం చేశారు.