ఆ రోజు పెట్రోల్ బంకులు కూడా బంద్
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సర్వే నిర్వహించనున్న ఈనెల 19న తెలంగాణ అంతటా ప్రభుత్వం సెలవుదినం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు అన్నింటికీ సెలవిచ్చింది. బ్యాంకులు, విద్యాసంస్థలు, దుకాణాలు, పెట్రోల్ బంకులు కూడా తెరుచుకోవు.
రంగారెడ్డి జిల్లా, జంట నగరాల పరిధిలో ఉన్న 350 పెట్రోలు బంకులు ఉదయం 6 నుంచి మూసివుంచాలని పెట్రోలియం డీలర్స్ ఫెడరేషన్ నిర్ణంయించింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరగవు. ఒక్క వాహనం కూడా రోడ్డెక్కదని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సర్వే రోజున అందరూ తమ ఇళ్లలోనే ఉండి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.