ఓటర్ల పేర్లు తొలగించడం లేదు | do not Removing the names of voters | Sakshi
Sakshi News home page

ఓటర్ల పేర్లు తొలగించడం లేదు

Published Fri, Aug 7 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

ఓటర్ల పేర్లు తొలగించడం లేదు

ఓటర్ల పేర్లు తొలగించడం లేదు

ఆధార్‌తో అనుసంధానం
 44.4 శాతం పూర్తి
 జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టీకరణ

 
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం గురువారం నాటికి 44.4 శాతం పూర్తయిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 73.51 లక్షల ఓటర్ల కుగాను ఇప్పటి వరకు  32.45 లక్షలు ఓటర్లు ఆధార్‌తో అనుసంధానమయ్యారన్నారు. అలాగే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఓటర్ల జాబితాకై ఓటర్ల గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. గురువారం జీహెచ్‌ఎంసీలో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పోల్చి చూస్తే  హైదరాబాద్ నగరంలో ఓటర్ల గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందన్నారు.

పౌరసరఫరాల శాఖ, ఇతర  ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఆధార్ డేటా సేకరించి  ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా ఇళ్లు మారినా.. డోర్‌లాక్ , మరణించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయపార్టీలకు అందజేస్తామన్నారు. అలాగే జాబితాను అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం, వెబ్‌సైట్‌లో పొందుపర్చడం చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement