వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంకేఎస్‌వై అమలుకు యోచన
సాక్షి, హైదరాబాద్: కేంద్రం కొత్తగా చేపడుతున్న ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళిక శరవేగంగా ముస్తాబవుతోంది. మార్చి చివరి నాటికి రాష్ట్ర సమగ్ర ప్రణాళికలను పూర్తి చేసే లా కార్యాచరణ జరుగుతోంది. ఈ పనుల పురోగతిని సీఎస్ రాజీవ్‌శర్మ బుధవారం సమీక్షించనున్నారు. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల ప్రతిపాదనలందినా వాటిలో మార్పుల్ని సూచిస్తూ ఉన్నతాధికారులు తిప్పిపంపారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచే పథకం పనులు ప్రారంభించాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి.