మార్చి నాటికి ‘హరితహారం’ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
Published Tue, Aug 16 2016 11:45 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ: హరితహారంలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ జిల్లాకు నిర్దేశించిన 4.80 కోట్ల మెుక్కల లక్ష్యాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొక్కలను పర్యవేక్షించే బాధ్యత ఇప్పటి వరకు ఉపాధి హామీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జరిగిందని, ఇక నుంచి ఏ శాఖ పరిధిలో నాటిన మొక్కలకు ఆ శాఖాధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటిన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. తనిఖీ నివేదికను ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్ ప్రకారం శనివారంలోగా కలెక్టర్‌కు సమర్పించాలని, దానిని కలెక్టర్ పరిశీలించిన అనంతరం అదే రోజు సాయంత్రం వరకు ప్రభుత్వానికి పంపాలన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి మొక్కల ఎదుగుదలకు సంబంధించిన ఫోటోలను తీసి పం పించాలన్నారు. మెుక్కల రక్షణకు ‘కాటిల్ గ్రాప్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement