హరితహారంపై వీడియోకాన్ఫరెన్స్
హరితహారంపై వీడియోకాన్ఫరెన్స్
Published Tue, Jul 19 2016 10:44 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
నల్లగొండ : తెలంగాణకు హరితహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో మొక్కలు నాటలేదన్నారు. ఇప్పటికే అన్ని చోట్ల గుంతలు తీసి సిద్ధంగా ఉంచామని వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, అటవీ శాఖ అదనపు సీసీఎఫ్ పరై్గన్, చీఫ్ కన్వజర్‌వేషన్ ఫారెస్టు (టెరిటోరియల్, హైదరాబాద్) సిద్ధానంద్ కుకురుతి, అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్వజర్‌వేషన్ ఫారెస్టు (టెరిటోరియల్, హైదరాబాద్) సి.బి మలాసి, ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి పాల్గొన్నారు.
Advertisement