హరితహారంలో ప్రభుత్వం విఫలం : వంగాల
హరితహారంలో ప్రభుత్వం విఫలం : వంగాల
Published Tue, Jul 19 2016 9:50 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ : జాతీయ రహదారి వెంట 10 అడుగుల లోపే మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగాల స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న జాతీయ రహదారిగా ఉన్న 6 లేన్లుగా విస్తరణ జరగనుందని ఈ నేపథ్యంలో సీఎం ఒకే రోజు లక్ష మొక్కలను నాటించడం వల్ల అందుకు వెచ్చించిన డబ్బులన్ని వృథానే అన్నారు. హరితహారంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో లేదన్నారు. పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోతే ఆగస్టు 15న పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రియాజ్ అలీ, మందడి సైదిరెడ్డి, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement