Vangala
-
ఐజయ్య ఎవరో మీ నాన్ననడుగు
మిడుతూరు: ‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్ కట్ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య ఎవరో ఇంతవరకు తనకు తెలియదని వ్యంగ్యంగా మాట్లాడటం తగదన్నారు. మండల పరిధిలోని మాసపేటలో ఎమ్మెల్యే తనయుడు వై.చంద్రమౌళితో కలిసి భరత్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని తమరు దొడ్డిదారిన మంత్రి పదవిని చేపట్టి.. 23 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వై.ఐజయ్యను ఎవరో తెలియదనడం హాస్యాస్పదమన్నారు. నందికొట్కూర్ అభివృద్ధికి నిధులు కావాలని ఎవరూ అడగలేదనడంలో కూడా నిజం లేదన్నారు. అనుక్షణం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే 2016జూలై 18న రూ.6 కోట్లు, సెప్టెంబర్ 8న రూ.5 కోట్లు, అక్టోబర్ 4న రూ.5 కోట్లు, 2017 అక్టోబర్ 4న ఎస్డీఎఫ్ ఫండ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఇవేవీ తెలయకుండా మాట్లాడటం అవివేకానికి నిదర్శనమన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి, కడుమూరు మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు లోకేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో ప్రభుత్వం విఫలం : వంగాల
నల్లగొండ : జాతీయ రహదారి వెంట 10 అడుగుల లోపే మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగాల స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న జాతీయ రహదారిగా ఉన్న 6 లేన్లుగా విస్తరణ జరగనుందని ఈ నేపథ్యంలో సీఎం ఒకే రోజు లక్ష మొక్కలను నాటించడం వల్ల అందుకు వెచ్చించిన డబ్బులన్ని వృథానే అన్నారు. హరితహారంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో లేదన్నారు. పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోతే ఆగస్టు 15న పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రియాజ్ అలీ, మందడి సైదిరెడ్డి, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
వంగాల (గుండాల) : గుండాల మండలం తుర్కలశాపురం గ్రామ పంచాయతీ పరిధి వంగాల గ్రామానికి చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాయం కృష్ణారెడ్డి-జయమ్మల రెండవ కుమారుడు గాయం సోమశేఖరరెడ్డి (32) తాగుడు, చెడు అలవాట్లకు బానిసై ఇంటి వద్ద ఉండకుండా ఆవారాగా తిరుగుతుండే వాడు. తండ్రి మరణించడంతో తల్లి జయమ్మ వంగాల కొత్త కాలనీలో నివాసం ఉంటోంది. సోమశేఖరరెడ్డి సోదరుడు మహేందర్‌రెడ్డి వృత్తి రీత్యా భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. సోమశేఖరరెడ్డి తాగుడుకు బానిసై వారానికి ఒకసారి స్వగ్రామానికి వచ్చి తల్లి జయమ్మను దూషించి డబ్బులు తీసుకుని తిరిగి వెళ్లిపోయేవాడు. అయితే ఈ నెల 14న గ్రామానికి చేరుకున్న సోమశేఖరరెడ్డి పొన్నగాని వీరేషం వద్ద కల్లు తాగి గ్రామంలోని గుబ్బ కోటేశ్వర్ కిరాణం కొట్టులో బెండకాయలు కొనుగోలు చేసి పాత కాలనీలో ఉన్న తన ఇంటికి పోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సోమశేఖరరెడ్డిపై దాడి చేసి తలపై గట్టిగా కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు ఇంటి ఆవరణలోనే ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడవేసి వెళ్లిపోయారు. దుర్వాసన వస్తుండడంతో.. మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో గ్రామ సేవకుడు వ్యవసాయ బావిలో చూడడంతో మృతదేహం కనిపించింది. మృతుడి సోదరుడు గాయం మహేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.మధుసూదన్‌రెడ్డి తెలి పారు. మృతదేహం కుళ్లిపోవడంతో సంఘటన స్థలానికే ఆలేరు వైద్యాధికారిని పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. రామన్నపేట ఇన్చార్జి సీఐ శివరాంరెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తుల..?గ్రామస్తులు ఎవరైనా హత్య చేసి ఉంటారా...? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.