
సచివాలయంలో ఏసీల తొలగింపు
విద్యుత్ కొరత రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పొదుపు చర్యలపై దృష్టి సారించింది.
హైదరాబాద్: విద్యుత్ కొరత రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పొదుపు చర్యలపై దృష్టి సారించింది. ప్రధాన పరిపాలన కార్యాలయం సచివాలయం నుంచే విద్యుత్ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.
అనుమతి, అర్హతలేని అధికారులకు ఏసీ కనెక్షన్లు తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు మాత్రమే ఏసీ వాడాలని పేర్కొన్నారు.
దీంతో తెలంగాణ సచివాలయంలోని ఏసీబీడీ బ్లాకుల్లో అక్రమంగా వాడుతున్న ఏసీలను అధికారులు సోమవారం తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలోనూ కరెంట్ ఆదా చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.