సీఎస్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినతి
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు.
మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం, దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట మండలాలను కొత్తగా ఏర్పాటుచేయబోయే వనపర్తి జిల్లాలో కలపనున్నట్లు ప్రభుత్వం డ్రాప్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఆ రెండు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఈ ఎమ్మెల్యేలు సీఎస్‌కు విన్నవించారు.