సాక్షి, హైదరాబాద్: మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక జీరో అవర్‌లో 10 మంది సభ్యులు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయకట్టు స్థిరీక రణపై వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్), తమ నియోజకవర్గాల్లో వైద్య సదుపాయాల కల్పనపై భూపాల్‌రెడ్డి, ఆరూరి రమేశ్ (టీఆర్‌ఎస్), మణికొండ దర్గా స్థలం వినియోగంపై అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన 645 మంది క్లాస్–4 ఉద్యోగుల గురించి కిషన్‌రెడ్డి (బీజేపీ), వైరా రిజర్వాయర్ గురించి మదన్‌లాల్ (టీఆర్‌ఎస్), ఖమ్మం జిల్లాలో కల్తీకారం, కల్తీ విత్తనాలపై వెంకటవీరయ్య (టీడీపీ), చౌటుప్పల్ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలపై చర్యల గురించి కె.ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), పారామెడికల్ సిబ్బంది క్రమబద్ధీకరణ గురించి సున్నం రాజయ్య (సీపీఎం) తదితర అంశాలను సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.