సీఎస్‌తో మెట్రో ఎండీ భేటీ | NVS Reddy meets Rajiv Sharma on the issue of metro rail project | Sakshi
Sakshi News home page

సీఎస్‌తో మెట్రో ఎండీ భేటీ

Published Sun, Sep 21 2014 3:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

NVS Reddy meets Rajiv Sharma on the issue of metro rail project

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతి, తాజా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్‌ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రో పనులు సాఫీగా జరిగేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణ ఇతర అంశాలను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కాగా, సమావేశంలో చర్చించిన అంశాలు మీడియాకు పొక్కకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement