ఆ లేఖ పాతదే: ఎన్వీఎస్‌రెడ్డి | Metro Rail MD Clarifies on Letter to Government | Sakshi
Sakshi News home page

ఆ లేఖ పాతదే: ఎన్వీఎస్‌రెడ్డి

Published Thu, Sep 18 2014 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Metro Rail MD Clarifies on Letter to Government

సాక్షి,సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న అడ్డంకులపై ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాసినదేనని ఇందులో కొత్తవిషయమేమీ లేదని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్నెల్ల క్రితం రాసిన ఈ లేఖను భూతద్దంలో పెట్టి చూడడం సరికాదన్నారు. 
 
బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ..నగరంలో మెట్రో ప్రాజెక్టు పనులు సాఫీగా ముందుకుసాగుతాయని, పనులు ఎక్కడా ఆగలేదని ఒక్కో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ప్రాజెక్టు పనుల నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ వైదొలగడం లేదని స్పష్టంచేశారు. మెట్రో పనులు చేపడుతున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రభుత్వానికి పలు అంశాలపై లేఖలు రాయడం సహజమేనన్నారు. ఎల్‌అండ్‌టీ,హెచ్‌ఎంఆర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సూచనలు,మార్గదర్శకాల మేరకు పనిచేస్తున్నాయని ఈ విషయంలో రాద్ధాంతం అవసరం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement