
కోర్టు ఆవరణలో న్యాయవాది దారుణ హత్య
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో శుక్రవారం కనిపించిన న్యాయవాది మృతదేహం కలకలం రేపింది. గత రాత్రి అతణ్ని దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న న్యాయవాది మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు అతణ్ని రాజీవ్ శర్మగా పోలీసులు గుర్తించారు. దీంతో న్యాయవాదుల కోఆర్టినేషన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారనీ ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యుడు డీడీ శర్మ తెలిపారు.