
నివేదికలు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలా?
సీఎస్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రీఇంజనీరింగ్ పేరిట మార్పులు చేస్తు న్న ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు లేకుండానే టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు చేపట్టడంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది నివేదికలు రాకుండానే, ఇష్టారీతిన వ్యయ అం చనాలు ఖరారు చేసి టెండర్లు పిలవడమేం టని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం రాసిన లేఖలో ప్రశ్నించారు. ప్రాజెక్టు నివేదికలను ప్రజల ముందుంచాలన్నారు.
కొన్ని ప్రాజెక్టుల పరిధిలో రీఇంజనీరింగ్‌తో డిజైన్‌లో మార్పులు చేసి వ్యయాలను పెంచినప్పటికీ, పనులను పాత కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు సైతం మొదలు పెట్టకుండానే వ్యయాన్ని రూ.35,200 కోట్ల నుంచి రూ.47,500 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు.