
నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రితో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు.