ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఎం. చందూలాల్, వ్యవసాయ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా డి.వెంకటేశ్వరరావును నియమించారు. అలాగే బుధవారం రాత్రి ఇచ్చిన ఉత్తర్వుల్తో మత్స్యశాఖ డెరైక్టర్‌గా నియమితులైన టి.విజయ్ కుమార్‌ను విద్యాశాఖ సంయుక్త కార్యదర్శిగా పునర్నియామకం చేశారు. బుధవారం పదిమంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ కాగా, అందులో సగం మందికి పైగా పోస్టుల్లో చేరలేదు. మరింత మెరుగైన పోస్టింగ్‌ల కోసం వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.